తెలంగాణ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టుకెళ్లినా కూడా చుక్కెదురైంది. ఈడీ కేసు విచారణ తీరును ఆమె సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. కానీ ఈడీ అధికారులు మాత్రం తగ్గేదేలే అంటున్నారు. తప్పనిసరిగా విచారణకు రావాల్సిందేనని చెబుతున్నారు.
కవిత పిటిషన్ ఈనెల 26కు వాయిదా వేసిన సుప్రీంకోర్టు
ఈరోజు విచారణకు హాజరుకావాలని కవితకు నిన్న నోటీసులు జారీ చేసిన ఈడీ
ఈడీ విచారణ తీరును సవాల్ చేస్తు సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన BRS ఎమ్మెల్సీ కవిత
మహిళలను ఈడీ ఆఫీసుకు పిలిచి విచారించొద్దని పిటిషన్
కవిత తరఫున సుప్రీంకోర్టులో విక్రమ్ చౌదరి వాదనలు వినిపించారు
గతంలో నళిని చిదంబరం కేసు విషయాన్ని ప్రస్తావిస్తు అప్పట్లో ఎలా వెసులుబాటు కల్పించారో తనకు కూడా అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి
కానీ కవిత విచారణకు హాజరుకావాల్సిందేనని స్పష్టం చేసిన ఈడీ
కావాలంటే మరో 10 రోజుల సమయం ఇస్తామని తెలిపిన ఈడీ
ఈ క్రమంలో రెండు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం తీర్పును వాయిదా వేసింది
అయితే వారి వాదోపవాదనల తర్వాత ఈనెల 26న దీనికి సంబంధించి తీర్పు ఇవ్వనుంది