బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. జూబ్లీహిల్స్‌లోని పోలింగ్ బూత్‌లో కవిత తన ఓటు వేసిన తర్వాత తమ పార్టీకి ఓటు వేయాలని విజ్ఞప్తి చేసినందుకు కాంగ్రెస్ పార్టీ కంప్లైంట్ చేసింది.
తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారని కాంగ్రెస్ పార్టీ చెబుతోంది. బీఆర్ఎస్కు ఓటు వేయాలని ఆమె ప్రజలకు విజ్ఞప్తి చేశారని తెలిపింది. అయితే బంజారాహిల్స్ డీఏవీ స్కూల్ పోలింగ్ కేంద్రంలో ఈరోజు ఎమ్మెల్సీ కవిత తన ఓటును వినియోగించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడారు. ఆ క్రమంలో కవిత కోడ్‌ను ఉల్లంఘించి బీఆర్ఎస్కు ఓటు వేయాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారని కాంగ్రెస్ పార్టీ అంటోంది.
MLC K Kavitha’s Appeal: To the young men & women, your vote is crucial. Today isn’t a holiday; it’s a day to strengthen democracy. Despite the noise, people supported BRS in 2018, & I believe they will again. People’s love is with KCR, and we aim to win. #TelanganaElections2023pic.twitter.com/Y0SUEjqtKO
దీనిపై చర్యలు తీసుకోవాల్సిందిగా తెలంగాణ శ్రీ వికాస్‌రాజ్ సీఈవో దృష్టికి తీసుకెళ్లామని టీపీసీసీ నేత నిరంజన్ వెల్లడించారు. ఫిర్యాదుతో పాటు ఆమె చిరునామాకు సంబంధించిన వీడియోను కూడా పార్టీ మీడియాకు షేర్ చేసింది. బీఆర్ఎస్పై నిన్నటి నుంచి ఇప్పటివరకు కాంగ్రెస్ మూడో ఫిర్యాదు దాఖలు చేయడం విశేషం. ఈ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ డిసెంబర్ 3న జరగనుంది.