»The Evm In The Jubilee Hills Polling Station On Allu Arjuns Line Was Barking
Allu Arjun: పోలింగ్ కేంద్రంలో ఈవీఎం మొరాయింపు
తెలంగాణలో ఈరోజు ఉదయం ఓటింగ్ ప్రక్రియ మొదలు కాగా..ప్రముఖ హీరో అల్లు అర్జున్ ఓటు వేసేందుకు వచ్చిన జూబ్లీహిల్స్ నియోజకవర్గం పోలింగ్ కేంద్రంలో ఈవీఎం మొరాయించింది. దీంతో స్టార్ హీరో లైన్లోనే వేచి ఉన్నారు.
The EVM in the jubilee hills polling station on Allu Arjun's line was barking
తెలంగాణలో ఓటింగ్ ప్రక్రియ ఈరోజు ఉదయం 7 గంటలకు మొదలు కాగా..పలు చోట్ల ఈవీఎంలు మొరాయించాయి. మరోవైపు ఓటు వేసేందుకు తరలి వచ్చిన ఓటర్లు క్యూలైన్లలో వేచి ఉన్నారు. అయితే టాలీవుడ్ స్టార్ హీరోలు ఎక్కువగా ఓటువేసే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అల్లు అర్జున్ కూడా ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారు. లైన్లో ఉన్నప్పటికి జూబ్లీహిల్స్ పోలింగ్ కేంద్రంలో ఈవీఎం మొరాయించింది. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ లైన్లోనే ఉన్నారు. ఆ తర్వాత అధికారులు ఈవీఎంలను సరిచేయడంతో అల్లు అర్జున్ ఓటు వేశారు. ఇదే నియోజకవర్గంలో మరో పోలింగ్ కేంద్రానికి వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ దంపతులు సైతం వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు. మరోవైపు సూర్యాపేట బూత్ నంబర్ 89, బాసర 262, లక్సెట్టిపేట 83వ బూత్, మెదక్ జిల్లా ఎల్లాపూర్, కరీంనగర్ 371వ బూత్ లలో ఈవీఎంలు మొరాయించాయి. ఈ క్రమంలో సిరిసిల్లలో రెండు చోట్ల కూడా ఈవీఎంలు సమయానికి పనిచేయలేదు.