»Telangana Assembly Elections 2023 Voting Start Several Polling Stations
Telangana assembly Elections 2023: పోలింగ్ సమరం షురూ..మొదలైన ఓటింగ్ ప్రక్రియ
తెలంగాణలో ఓటింగ్ ప్రక్రియ మొదలైంది. ఇది సాయంత్రం 5 గంటలకు వరకు కొనసాగనుంది. ఈ నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా 144 సెక్షన్ విధించారు.
Telangana Elections 2023 voting start several polling stations
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల(Telangana assembly Elections 2023) ఓటింగ్ ప్రక్రియ రాష్ట్రంలో ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. అధికారులు ఉదయం 6 గంటలకు మాక్ పోలింగ్ నిర్వహించగా..7 గంటలకు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మొదలుపెట్టారు. సాయంత్రం 5 గంటల వరకు ఈ పోలింగ్ కొనసాగనుంది. సమస్యాత్మకమైన 13 నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలకే ఓటింగ్ ప్రక్రియ పూర్తి కానుంది. ఇప్పటికే ఈ ఎన్నికల సంఘం ఓటింగ్ సజావుగా సాగేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. మరోవైపు పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంది. దీంతోపాటు ఓటర్లు పోలింగ్ కేంద్రానికి మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకురావడాన్ని నిషేధించారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోటిలో(contest) జాతీయ, ప్రాంతీయ పార్టీలతోపాటు 109 పార్టీల నుంచి 2,290 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. రాష్ట్రంలో 119 నియోజకవర్గాల్లో 3,26,18,205 మంది ఓటర్లు ఉండగా, అందులో 1,62,98,418 మంది పురుషులు, 1,63,01,705 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. నేడు(నవంబర్ 30న) 35,356 పోలింగ్ స్టేషన్లలో ఓటింగ్ ప్రక్రియ జరుగుతుంది. పోలైన ఓట్లను డిసెంబర్ 3న లెక్కించనున్నారు.
2018లో టీఆర్ఎస్కు 56.8 శాతం ఓట్లు రాగా, కాంగ్రెస్కు 17.6 శాతం, టీడీపీకి 12.61 శాతం, ఏఐఎంఐఎంకు 6.3 శాతం, బీజేపీకి 4.5 శాతం ఓట్లు వచ్చాయి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ తమ సంక్షేమ పథకాల విజయం, తన వ్యక్తిగత చరిష్మాపై ఎక్కువగా చూపిస్తూ మూడోసారి(BRS) అధికారంలోకి రావాలని చూస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్(congress) పార్టీ అధికార బీఆర్ఎస్ పార్టీ తప్పులను ఎత్తి చూపుతుంది. గత 10 ఏళ్లలో రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టు, ధరణి అవినీతి మయంగా మారిందని ఆరోపిస్తుంది. ఇక నరేంద్ర మోడీ సాధించిన విజయాలను బిజెపి(BJP) గుర్తు చేస్తూ రాష్ట్రంలోని పలు సెగ్మెంట్లలో గెలవాలని చూస్తోంది.