JNG: పాలకుర్తి పట్టణ కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం ఆదివారం జరిగింది. పాలకుర్తి కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్లు కుందూరు గోపాల్ రెడ్డి, ఇట్టే శ్యామ్ సుందర్ రెడ్డిలు ముఖ్యఅతిథిగా పాల్గొని కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. ప్రభుత్వ పథకాల అమలు, త్వరలో జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికలలో పార్టీ విజయం సాధించడం పై ఈ సమావేశంలో చర్చించారు.