GNTR: గుంటూరు మున్సిపల్ ఇంజినీరింగ్ ఔట్సోర్సింగ్ కార్మికులు ఆదివారం తక్కెళ్లపాడు రోడ్డులోని హెడ్ వాటర్ ట్యాంక్ ఇంజినీర్ ఆఫీస్ వద్ద ధర్నా చేపట్టారు. జీవో 36 ప్రకారం జీతాలు పెంచాలని, 17 రోజులుగా సమ్మె చేస్తున్నా పట్టించుకోవడంలేదని CITU నగర కార్యదర్శి లక్ష్మణరావు అన్నారు. షరతులు లేకుండా సంక్షేమ పథకాలు అమలు చేయాలన్నారు.