ADB: బజార్హత్నూర్ మండల కేంద్రానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు చట్ల గజ్జయ్య అనారోగ్యంతో మరణించారు. ఆదివారం నిర్వహించిన అంతక్రియల్లో MLA అనిల్ జాదవ్ పాల్గొని పాడే మోశారు. అంతకుముందు గజ్జయ్య పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని భరోసా కల్పించారు.