ATP: రాజీవ్ కాలనీ నుంచి గుత్తి రోడ్డుకు లింక్ రోడ్డు ఏర్పాటు చేస్తున్నామని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తెలిపారు. ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమంలో భాగంగా ఆయన ఇంటింటికీ వెళ్లారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించి కరపత్రాలు పంపిణీ చేశారు. రాజీవ్ కాలనీలోని డంపింగ్ యార్డ్ సమస్యను అక్టోబర్ 2 నాటికి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.