ప్రకాశం: ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ ప్రకాశం జిల్లా ఇంఛార్జిగా తాతపూడి ప్రభుదాస్ నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ అధిష్టానం ఉత్తర్వులు జారీ చేసిందని ప్రభుదాస్ ఆదివారం తెలిపారు. ప్రకాశం జిల్లాలో బహుజన సమాజ్ పార్టీని బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. వెనుకబడిన కనిగిరి నియోజకవర్గంలో సమస్యల పరిష్కారానికి బీఎస్పీ తరపున పోరాటం చేస్తామని ప్రభుదాస్ అన్నారు.