W.G: నిద్రిస్తున్న మహిళపై గుర్తు తెలియని వ్యక్తి వచ్చి కత్తితో దాడి చేసి ఘటన పాలకొల్లులో చోటు చేసుకుంది. పాలకొల్లు మండలం అర్థకట్లకి చెందిన యాళ్లబండి వెంకట రమణ ఆమె ఇంట్లో శనివారం రాత్రి నిద్రించారు. గుర్తు తెలియని వ్యక్తి వచ్చి తలుపు కొట్టగా, వెంకట రమణ తలుపు తీయగా, పీకపై కత్తితో గాయం చేసి పరారయ్యాడు. ఘటనా స్థలాన్ని డీఎస్పీ శ్రీవేద పరిశీలించారు.