NDL: ఇళ్లస్థలాల మంజూరు, ప్రభుత్వ హామీల అమలుకై సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ ఆధ్వర్యంలో రేపు కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిస్తున్నట్లు జిల్లా నాయకులు వెంకటేశ్వర్లు తెలిపారు. ఆదివారం నందికొట్కూరులోని ఎస్.ఎస్.ఆర్.నగర్లో పెన్షన్ లబ్ధిదారులతో సమావేశం అయ్యారు. ఆయన మాట్లాడుతూ..రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.