KMM: ఉమ్మడి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ చల్లా వంశీచంద్ రెడ్డిని వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వైరా నియోజకవర్గ రాజకీయ పరిస్థితులపై చర్చించగా, పార్టీ బలోపేతానికి అవసరమైన చర్యలపై వివరించారు. ఈ సమావేశంలో జిల్లా డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, వడ్డె నారాయణ రావు తదితరులు పాల్గొన్నారు.