Brazilian football player fined 27 crores for building a lake without considering the environment
Neymar: బ్రెజిల్ ఫుట్బాల్(Football) స్టార్ నేమార్(Neymar) కు కోర్టు.. 3.3 మిలియన్ డాలర్లు అంటే రూ.27 కోట్లకుపైగా జరిమానా(fine) విధించింది. పర్యావరణ అనుమతులు(Environmental clearances) లేకుండా రియో డి జెనీరో పట్టణ శివారులోని తన ఇంటి వద్ద సరస్సు నిర్మించినందుకు గాను ఈ భారీ ఫైన్ వేసింది. నేమార్ తన భవనం వద్ద కృత్రిమ సరస్సు నిర్మాణంలో నిబంధనలు ఉల్లంఘించినందుకు(Violation of regulations) టౌన్ కౌన్సిల్ నాలుగు జరిమానాలు విధించినట్టు కౌన్సిల్ సెక్రటేరియట్ అధికారికంగా తెలిపింది. నేమార్ కు బ్రెజిల్ కరెన్సీ(The currency of Brazil) ప్రకారం మొత్తంగా 16 మిలియన్ రియాలు(Riya) మన కరెన్సీలో చెప్పాలంటే అక్షరాల రూ. 27,27,69,361 జరిమానా విధించినట్టు కౌన్సిల్ నివేదికలో పేర్కోంది. అనుమతి లేకుండా నది నీటిని దొంగిలించడం, మళ్లించడం, వృక్ష సంపదను నరికివేయడం, భూమిని తవ్వడం వంటి నాలుగు అభియోగాలపై కౌన్సిల్ ఈ జరిమానా విధించింది. వీటిపై అప్పీలు చేసుకునేందుకు నేమార్కు 20 రోజుల సమయం ఇచ్చింది.
నేమార్ ఇంటి నివాసం వద్ద ఏర్పాటు చేసుకున్న సరస్సుకు సంబంధించిన ఫోటోలను జూన్ 22న తన సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో అసలు విషయాలు వెలుగులోకి వచ్చింది. విలాసవంతమైన ఆయన భవనం వద్ద నిర్మిస్తున్న కృత్రిమ సరస్సు, బీచ్లో అనేక పర్యావరణ ఉల్లంఘనలు జరిగినట్టు అధికారులు గుర్తించారు. వెంటనే కోర్టు ఆదేశాల(Court orders) ప్రకారం సైట్ను స్వాధీనం చేసుకుని
జరుగుతున్న నిర్మాణ పనులు నిలిపివేశారు. కోర్టు జరిమానా విధించింది. అయితే ఇప్పటి వరకు నేమార్ కానీ ఆయన ప్రతినిధులు కానీ కోర్టు ఆదేశాలకు(Court orders) స్పందించలేదు.