Bellampally mlaకు అమ్మాయిలంటే పిచ్చి.. ఆరిజన్ సీఈవో ఆరోపణలు
Bellampally mla:బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు అమ్మాయిల పిచ్చి అట.. అరిజన్ సంస్థ సీఈవో బోడపాటి శైలజ (shailaja) అలియాస్ షెజల ఆరోపణలు చేశారు. దీనికి సంబంధించి ఆడియో కూడా సోషల్ మీడియాలో తిరుగుతుంది. బ్రోకర్‌తో ఎమ్మెల్యే చాటింగ్ కూడా వైరల్ అవుతుంది. బెల్లంపల్లిలో (bellampally) డెయిరీ ఏర్పాటుకు స్థలం ఇచ్చి డబ్బులు తీసుకున్నారని శైలజ (shailaja) ఆరోపించారు.
Bellampally mla:బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు అమ్మాయిల పిచ్చి అట.. అరిజన్ సంస్థ సీఈవో బోడపాటి శైలజ (shailaja) అలియాస్ షెజల ఆరోపణలు చేశారు. దీనికి సంబంధించి ఆడియో కూడా సోషల్ మీడియాలో తిరుగుతుంది. బ్రోకర్‌తో ఎమ్మెల్యే చాటింగ్ కూడా వైరల్ అవుతుంది. బెల్లంపల్లిలో (bellampally) డెయిరీ ఏర్పాటుకు స్థలం ఇచ్చి డబ్బులు తీసుకున్నారని శైలజ (shailaja) ఆరోపించారు. హైదరాబాద్ వచ్చిన ప్రతీసారీ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో (mla quarters) సపర్యలు చేశానని.. అమ్మాయిలను పంపాలని ఒత్తిడి చేస్తే పంపాననీ హాట్ కామెంట్స్ చేశారు. హామీ ఇచ్చినట్టు ప్లాంటు ఏర్పాటు చేసిన భూమిని రిజిస్ట్రేషన్ చేయించలేదన్నారు. పైగా తమపై తప్పుడు కేసులు పెట్టించి, వేధింపులకు గురిచేస్తున్నారని తెలిపారు.
బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య డబ్బులు తీసుకొని తమపై తప్పుడు కేసులు పెట్టించి వేధిస్తున్నారని శైలజ (shailaja) ఆడియో (audio) స్టార్ట్ అవుతుంది. చిన్నయ్యను తొలిసారి బ్రాంచి ఓపెనింగ్ సమయంలో కలిస్తే.. కంపెనీలో మా వాళ్లకు షేర్ ఇవ్వండి, మీకు ఫుల్ సపోర్టు చేస్తానని చిన్నయ్య చెప్పారట. ఓకే చెప్పడంతో రెండెకరాల స్థలం ఆఫర్ చేశారు. అందుకు రూ.20 లక్షలు (rs. 20 lakhs) అడ్వాన్స్‌గా చెల్లించామని.. ఆ స్థలం ప్రభుత్వానిదని నిర్ధారణ కావడంతో త్వరలో రిజిస్ట్రేషన్ చేయించి ఇస్తానని ఆయనే చెప్పారట. ప్లాంటు కన్స్ట్రక్షన్ బాధ్యతను సాన శ్రావణ్, థామస్ అనే వ్యక్తులకు అప్పగించారు. బిజినెస్ మీటింగ్ కోసం హైదరాబాద్‌లో గల ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో తరుచుగా చిన్నయ్యను కలిసే వాళ్లం. ఎమ్మెల్యే క్వార్టర్స్‌కు తనతో మరో అమ్మాయి (girl) వచ్చింది. ఎమ్మెల్యే కాల్ చేసి మీతో వచ్చిన అమ్మాయిని నైట్‌కు పంపిస్తారా? అని అడిగారు. ఆ అమ్మాయి అలాంటిది కాదని చెప్పాను. ఏ అమ్మాయినైనా పంపించాలని ఒత్తిడి చేశారు. తెలిసిన వారి ద్వారా ఆయనకు ఓ బ్రోకర్ నంబర్ ఇచ్చి, యువతులు వెళ్లేలా ఏర్పాట్లు చేశాం. మరోసారి.. దళితబంధు విషయమై మాట్లాడాలని ఎమ్మెల్యే క్వార్టర్స్‌కు పిలిచారు. మద్యం ఆఫర్ చేశారు. అలవాటు లేదని చెప్పి తిరిగొచ్చేశాం అని శైలజ అంటున్నారు.
మళ్లీ ఎమ్మెల్యే ఫోన్ చేసి దళితబంధు విషయం మాట్లాడాలని బెల్లంపల్లిలోని ఇంటికి రావాలని కోరగా వెళ్లామన్నారు. కాసేపటికే పోలీసులను పిలిపించి.. మూడు రోజులు బంధించారని చెప్పారు. పోలీస్ స్టేషన్లో టార్చర్ చూపించి.. నాలుగో రోజు ఆదిలాబాద్ జిల్లా జైలుకు రిమాండ్‌కు తరలించారని పేర్కొంది. 20 రోజుల (20 days) తర్వాత కండీషన్ బెయిల్‌పై బయటకొచ్చాం. శని, ఆదివారాల్లో బెల్లంపల్లి టూ టౌన్ పోలీస్ స్టేషన్లో హాజరవ్వాలి. పోలీస్ స్టేషన్ వెళుతున్న తమను ఎమ్మెల్యే మనుషులు లక్షెట్టిపేట నుంచి వెంబడించారు. అక్కడ ఎస్సైను కేసు నమోదు చేయాలని కోరగా, వ్యక్తిగతంగా రావాలని సూచించారు. తమకు థ్రెట్ ఉంది, రాలేం అని చెబితే వినిపించుకోలేదు. బెల్లంపల్లి ఎమ్మెల్యే, ఆయన మనుషులతో తమకు ప్రాణహాని ఉన్నందున కాపాడాలని శైలజ (shailaja) వేడుకున్నారు.
శైలజ (shailaja) ఆరోపణలపై ఎమ్మెల్యే (mla) దుర్గం చిన్నయ్య స్పందించారు. డెయిరీ పేరుతో రైతులను మోసగించేందుకు ఆది నారాయణ, శైలజ ప్రయత్నించారని వివరించారు. దీనిని తను అడ్డుకోవడంతో తన పేరు డ్యామేజ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిలపారు. బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడుతున్నారని వివరించారు. వాళ్లు చీటర్స్ అని, రైతులను మోసం చేసేందుకు ప్రయత్నించడంతో పోలీసులకు అప్పగించానని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తెలిపారు.