Director Teja Interesting Comments On Telugu Girls
Director Teja: తెలుగు సినిమాల్లో హీరోయిన్లను ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చుకోవాల్సి ఉంది. మూవీ ఇండస్ట్రీకి సంబంధించిన అన్నీ విభాగాల్లో తెలుగు రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కానీ హీరోయిన్లు మాత్రం చాలా తక్కువ.. తెలుగు రాష్ట్రాల నుంచి ఇండస్ట్రీకి పరిచయం అయిన వారిని వేళ్ల మీద లెక్క బెట్టవచ్చు.
ఇదే విషయంపై ప్రముఖ డైరెక్టర్ తేజ ( Director Teja) స్పందించారు. ఆయన తెరకెక్కించిన అహింస మూవీ ఈ రోజు విడుదలైంది. మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొన్నారు. తెలుగు అమ్మాయిలకు సహనం తక్కువగా ఉంటుందని తేజ అంటున్నారు. అందుకే వారికి అవకాశాలు అంతగా రావని చెప్పారు. తన సినిమాల్లో తెలుగు అమ్మాయిలకు ఛాన్స్ ఇవ్వాలని అనుకున్నానని.. కుదర్లేదని చెప్పారు. ఓ 6 నెలల (6 months) తర్వాత మూవీ ఉంటుందని చెబితే ఆగలేరు. ఇప్పుడు అవకాశం కావాలని అంటారు. రకరకాల కారణాలు చూపి.. చిన్న క్యారెక్టర్ చేసేందుకు సైతం ఓకే చెబుతారు. హీరోయిన్ (heroine) ఆఫర్ కోసం మాత్రం ఓపికగా ఉండరు అని పేర్కొన్నారు. సహనంగా ఉంటేనే అవకాశం వస్తుందని స్పష్టంచేశారు. తేజ (teja) చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అంజలి, శ్రీ దివ్య, బిందు మాధవి వంటి తెలుగు హీరోయిన్స్ సత్తా చాటారు. ఆ తర్వాత వారికి తగిన అవకాశాలు లేవు. ఈ విషయాన్ని కొందరు ప్రస్తావిస్తున్నారు.