నక్షత్ర గతంలో మిస్ వైజాగ్ విజేతగా నిలిచారు. మిస్ వైజాగ్ పోటీల్లో పాల్గొన్న నక్షత్ర అందరి దృష్టిని ఆకర్షించడంతో మిస్ వైజాగ్ టైటిల్ ని సొంతం చేసుకున్నారు. 2013 డిసెంబర్ నెలలో ఓ మూవీ ఆడిషన్ లో నక్షత్ర, తేజ మధ్య పరిచయం ఏర్పడింది. మూవీ షూటింగ్ లో భాగంగా ఇద్దరూ ప్రేమలో పడ్డారు. 2015 ఫిబ్రవరి నెలలో పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరికీ ఒక పాప పుట్టింది. ఆ తరువాత వారిద్దరి మద్య గొడవలు మొదలయ్యాయని తెలిపింది నక్షత్ర.
మిస్ వైజాగ్ నక్షత్ర..ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఈమె హాట్ టాపిక్. తన భర్త తేజ వేరే మహిళతో ఉండడాన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడంతో ఒక్కసారిగా సంచలనంగా మారింది. దీంతో నక్షత్ర ఎవరు..? ఆమె లైఫ్ స్టోరీ ఏంటీ అనే చర్చ నడుస్తుంది.
పరిచయం ప్రేమ, వివాహం:
నక్షత్ర గతంలో మిస్ వైజాగ్ విజేతగా నిలిచారు. మిస్ వైజాగ్ పోటీల్లో పాల్గొన్న నక్షత్ర అందరి దృష్టిని ఆకర్షించడంతో మిస్ వైజాగ్ టైటిల్ ని సొంతం చేసుకున్నారు. 2013 డిసెంబర్ నెలలో ఓ మూవీ ఆడిషన్ లో నక్షత్ర, తేజ మధ్య పరిచయం ఏర్పడింది. మూవీ షూటింగ్ లో భాగంగా ఇద్దరూ ప్రేమలో పడ్డారు. 2015 ఫిబ్రవరి నెలలో పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరికీ ఒక పాప పుట్టింది. ఆ తరువాత వారిద్దరి మద్య గొడవలు మొదలయ్యాయని తెలిపింది నక్షత్ర.
ఆటలు ఆడి ఉద్యోగం పోయింది, వివాహేతర సంబంధాలు:
కాగా, తన భర్త…నావెల్ డాక్ యార్డ్ లో ఉద్యోగం చేసేవాడు. పబ్జీ గేమ్ కి బానిసై డ్యూటీకి వెళ్ళేవాడు కాదు. తెల్లవార్లూ గేమ్ ఆడుతూ అమ్మాయిలతో నీచంగా మాట్లాడేవాడు. ఉదయం పడుకునేవాడు. దీని వల్ల అధికారులు జాబ్ లోంచి సస్పెండ్ చేశారు. పబ్జీ గేమ్ లో అందమైన అమ్మాయిలని ట్రాప్ చేసేవాడని.. ప్రశ్నిస్తే వేధించేవాడని నక్షత్ర ఆరోపించారు. చాలా మంది మహిళలతో వివాహేతర సంబంధాలు పెట్టుకున్నాడని ఆమె ఆరోపించారు.
భయటపడ్డ నిజస్వరూపం, గొడవలు:
2020 వరకూ తన కాపురం బానే ఉండేదని.. ఎప్పుడైతే తన భర్త నిజస్వరూపం బయటపడిందో అప్పటి నుంచి గొడవలు మొదలయ్యాయని ఆమె అన్నారు. 2021 నుంచి ఇద్దరి మధ్య గొడవలు ఎక్కువయ్యాయని ఆమె అన్నారు. భర్త తేజ తనను గత కొంతకాలంగా వేధిస్తున్నాడని ఆమె ఆరోపించారు. అదనపు కట్నం కోసం హింసించేవాడని ఆమె ఆరోపించారు. అంతేకాదు…తేజకి సినిమాలంటే పిచ్చి అని.. సినిమాలు తీస్తా, హీరో అవుతా అని చెప్పి తన బంగారం మొత్తం తాకట్టు పెట్టేశాడని నక్షత్ర ఆరోపించారు. అతని తల్లిదండ్రుల వద్ద కూడా డబ్బులు తీసుకున్నాడని ఆమె అన్నారు.
వావి వరుసలు లేకుండా ప్రవర్తన:
ఇద్దరం కలిసి ఉన్నప్పుడే తేజ బ్యాక్ డోర్ మూవీ సినిమా చేశాడని ఆమె అన్నారు. అయితే ఆ సమయంలో ఆ మూవీ హీరోయిన్ తనతో డేట్ కి రమ్మంటుందని తనతో అనేవాడని.. దీని గురించి బ్యాక్ డోర్ మూవీ డైరెక్టర్ ని అడిగితే అదేం లేదని చెప్పారని ఆమె అన్నారు. అంతేకాదు…తన భర్త తేజ ఉమెనైజర్ అని.. ఆడది కనిపిస్తే వదిలిపెట్టడని ఆమె ఆరోపించారు. అక్కను కూడా అదే ఉద్దేశంతో చూసేవాడని.. వావి వరుసలు లేకుండా ప్రవర్తిస్తాడని ఆమె ఆరోపించారు. చాలా మంది అమ్మాయిలతో ఎఫైర్లు నడిపేవాడని.. వారితో అసభ్యకరంగా ఫోన్ లో మాట్లాడేవాడని ఆమె ఆరోపించారు. వాయిస్ రికార్డులు, అమ్మాయిలతో చాట్ చేసిన మెసేజులు వంటి సాక్ష్యాలు తన దగ్గర ఉన్నాయని ఆమె అన్నారు.
ఏపని లేదు..ఎఫైర్లు, కన్య కావాలంటాడు:
ప్రస్తుతం తేజ ఏ పనీ చేయడం లేదని.. ఏమైనా చేసేది ఉందంటే అది ఎఫైర్లు నడపడమే అని ఆమె అన్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే తనను మానసికంగా, శారీరకంగా హింసించాడని.. తనను దారుణంగా కొట్టాడని నక్షత్ర చెప్పుకొచ్చారు. ఒకసారి తన కాలు విరగ్గొట్టాడని.. చేతిపై వాత కూడా పెట్టాడని ఆమె ఆరోపించారు. తనను నువ్వు సంసారానికి పనికిరావు అనేవాడని.. రోజుకో కన్యను భార్యగా తీసుకురమ్మనేవాడని.. ఆమె ఆరోపించారు. అతనొక ఉమెనైజర్ అని.. అతని ఫోన్ నిండా బూతు వీడియోలే ఉంటాయని ఆమె ఆరోపించారు. తన భర్త ఎన్ని దారుణాలు చేసినా పాప కోసమే భరిస్తూ వచ్చానని.. అయితే ఎంత సహనం పాటించినా అతను మారలేదని ఆమె వాపోయింది. ఇప్పుడు ఏకంగా మరో మహిళతో భార్య అని చెప్పి కాపురం పెట్టాడని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
న్యాయం కోసం ధర్నా:
ఇక, మే 30న విశాఖపట్నంలోని తన భర్త ఆఫీస్ ముందు న్యాయం కోసం ధర్నాకు దిగారు నక్షత్ర. తన భర్త వేరే మహిళతో గదిలో ఏకాంతంగా గడుపుతుండగా నక్షత్ర రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. తనకు విడాకులు ఇవ్వకుండా భర్త తేజ వేరే మహిళను వివాహం చేసుకున్నారని ఆరోపించారు. భర్తతో పట్టుబడిన అమ్మాయి తనను బెదిరిస్తుందని.. నీ కూతురితో ఎలా బతుకుతావో చూస్తా అంటూ బెదిరిస్తుందని నక్షత్ర ఆరోపించారు.
తేజా వ్యాఖ్యలు:
ఇక నక్షత్ర ఆరోపణలపై తన భర్త తేజ…తనపై నక్షత్ర చేసిన ఆరోపణలు నిజం కాదని అన్నారు. తన మీద పలు కేసులు ఉన్నాయని.. అవి ఇంకా పెండింగ్ లో ఉన్నాయని తేజ వెల్లడించారు. ఇక తనతో గదిలో ఉన్న అమ్మాయి ఆడిషన్ కి వచ్చిందని.. మూవీ తీసే ప్లాన్ లో ఉన్నామని అన్నారు. ఇలా కుటుంబంలో తలెత్తిన సమస్యల కారణంగా ఒకప్పటి మిస్ వైజాగ్ ఇప్పుడు రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. అయినప్పటికీ ఆమె తన పోరాటాన్ని కొనసాగిస్తానని అంటున్నారు.