»Game Changer Shooting Of Game Changer In Vizag Leaked Pics Viral
Game Changer: వైజాగ్‌లో ‘గేమ్ చేంజర్’ షూటింగ్.. లీక్డ్ పిక్స్ వైరల్!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ చేంజర్ షూటింగ్.. ప్రస్తుతం వైజాగ్‌లో జరుగుతోంది. ఈ సందర్భంగా లీక్డ్ పిక్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. లేటెస్ట్ లుక్లొ చరణ్ అదిరిపోయాడని అంటున్నారు.
Game Changer: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ గేమ్ చేంజర్. స్టార్ డైరెక్టర్ శంకర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాను.. దిల్ రాజు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. కియారా అద్వానీ, అంజలి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ చివరి దశకు చేరుకుంది. అయితే.. శంకర్ మార్క్ పొలిటికల్ యాక్షన్ డ్రామాగా వస్తున్న సినిమా కావడంతో.. పబ్లిక్ ప్లేస్‌లలో గేమ్ చేంజర్ షూటింగ్‌ను ఎక్కువగా చిత్రికరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్ స్పాట్ నుంచి ఎన్నో వీడియోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.
గతంలో వచ్చిన లీక్డ్ పిక్స్ సినిమా పై ఓ రేంజ్లో అంచనాలు పెంచేశాయి. ఇక లేటెస్ట్ షెడ్యూల్ వైజాగ్‌లో జరుగుతోంది. రామ్ చరణ్ వైజాగ్‌లో ల్యాండ్ అయిన సందర్భంగా గ్రాండ్ వెల్కమ్ చెప్పారు మెగా ఫ్యాన్స్. ఇక ఆర్కే బీచ్‌లో పొలిటికల్ మీటింగ్‌కు సంబంధించిన షూటింగ్ జరుగుతోంది. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. చరణ్‌కు సంబంధించిన ఫోటోలను ఓ రేంజ్లో షేర్ చేస్తున్నారు అభిమానులు. ఆ సూటు, బూటులో మెగా పవర్ స్టార్ మామూలుగా లేడని ట్రెండ్ చేస్తున్నారు.
ఈ సినిమాలో చరణ్ తండ్రి కొడుకులుగా డ్యూయెల్ రోల్ చేస్తున్నాడు. కొడుకు పాత్రలో కలెక్టర్‌గా కనిపించనున్నాడు. అందుకే.. ఫార్మల్ వేర్లో అదిరిపోయే లుక్‌లో మస్త్ ఉన్నాడు చరణ్. అయితే.. షూటింగ్ స్పాట్ నుంచి ఇలాంటి లీకుల వల్ల సినిమా పై ఎఫెక్ట్ తప్పదనే చెప్పాలి. ఇప్పటికైనా మూవీ మేకర్స్ లీకులను కంట్రోల్ చేస్తే బెటర్ అంటున్నారు అభిమానులు.