Election Schedule 2024 : కేంద్ర ఎన్నికల సంఘం దేశ వ్యాప్తంగా లోక్‌సభ, పలు రాష్ట్రాల శాసన సభలకు నిర్వహించనున్న ఎన్నికలకు(Elections) సంబంధించిన నోటిఫికేషన్ని నేడు విడుదల చేయనుంది. అన్ని వివరాలతో కూడిన షెడ్యుల్‌ని వెల్లడించనుంది. శనివారం సాయంత్రం మూడు గంటలకు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి అన్ని వివరాలను ప్రకటించనుంది. న్యూఢిల్లీలోని జ్ఞాన్ భవన్లో ఈ ప్రెస్ మీట్ జరగనుంది. దీంతో యావత్ దేశం ఇప్పుడు ఈ విషయంపై ఆసక్తితో ఉంది.
ఈ ప్రెస్‌మీట్‌ను కొన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల్లోనూ లైవ్ స్ట్రీమ్ చేయనున్నారు. ఈ విషయాన్ని భారత ఎన్నికల సంఘం(Election Commission) ప్రతినిధి ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు. ఎన్నికల షెడ్యుల్ వెలువడిన మరు క్షణం నుంచి ‘మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్’ అమల్లోకి వస్తుంది. కోడ్ అమల్లోకి వచ్చిన వెంటనే అధికారంలో ఉన్న పార్టీలు కొత్తగా ఎలాంటి విధానపరమైన నిర్ణయాలూ తీసుకోవడానికి ఉండదు.
2019 నుంచి అధికారంలో ఉన్న వారి లోక్ సభ పదవీ కాలం వచ్చే జూన్ 16తో ముగుస్తుంది. దీంతో ఆ గడువుకు ముందే కొత్త సభను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఆలోపుగానే ఏసీ ఎన్నికలు జరపడం, కౌంటింగ్లాంటివి అన్నీ పూర్తి చేస్తుందని అంతా భావిస్తున్నారు. సాయంత్రానికి ఈ షెడ్యుల్‌పై క్లారిటీ వస్తుంది.