»Pushparaj Who Landed In Vizag The Craze Is Not Normal
Allu Arjun: వైజాగ్‌లో ల్యాండ్ అయిన పుష్పరాజ్.. క్రేజ్ మామూలుగా లేదుగా!
పుష్ప పార్ట్ 1 సినిమాతో బాక్సాఫీస్ దగ్గర 350 నుంచి 400 కోట్ల మధ్యే ఆగిపోయాం.. కానీ ఈసారి వెయ్యి కోట్లు టార్గెట్‌గా వస్తున్నామనేలా అంచనాలు పెంచేస్తున్నారు అల్లు అర్జున్, సుకుమార్. అందుకే.. అంతకుమించిన అనేలా ఉంది పుష్ప2 క్రేజ్.
Allu Arjun: పుష్ప పార్ట్ 1లో మాసివ్ పర్ఫార్మెన్స్తో అదరగొట్టేశాడు బన్నీ. దీంతో పుష్ప సినిమాకు గాను బన్నీ బెస్ట్ యాక్టర్‌గా నేషనల్ అవార్డ్ అందుకొని చరిత్ర సృష్టించాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. దీంతో.. ప్రజెంట్ సెట్స్ పై ఉన్న సినిమాల్లో పుష్ప2 భారీ హైప్ ఉంది. చాలా పర్ఫెక్ట్గా ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకొని పుష్ప2 షూటింగ్ చేస్తున్నాడు సుకుమార్. లేటెస్ట్గా రామోజీ ఫిలిం సిటీలో ఓ షెడ్యూల్ కంప్లీట్ చేసి.. నెక్స్ట్ షెడ్యూల్‌ను వైజాగ్‌లో ప్లాన్ చేశారు. ఇప్పటికే బన్నీ వైజాగ్‌లో ల్యాండ్ అయిపోయాడు. ఇక బన్నీ వస్తున్నాడని తెలియడంతో వైజాగ్ ఫ్యాన్స్ అంతా గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. భారీ ఎత్తున ర్యాలీలు.. పెద్ద ఎత్తున పూలను చల్లుతూ ఘన స్వాగతం పలికారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇందులో పుష్పరాజ్ స్టైలిష్ లుక్ వావ్ అనేలా ఉంది. అయితే.. షూటింగ్‌కు ఇలా ఉంటే, ఇక సినిమా రిలీజ్ అయినప్పుడు బన్నీ ఫ్యాన్స్ చేసే రచ్చ ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఇక.. వీలైనంత త్వరగా పుష్ప2 షూటింగ్ కంప్లీట్ చేసి.. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగష్టు 15న వరల్డ్ వైడ్‌గా థియేటర్లలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో ఫాహద్ ఫజిల్, అనసూయ, సునీల్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. మరి పుష్ప2 ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.