Oscar Awards: మరోసారి ఆస్కార్ వేదికపై చరణ్, ఎన్టీఆర్ సందడి!
అరె.. మరోసారి ఆస్కార్ వేదిక పై చరణ్, ఎన్టీఆర్ ఎలా సందడి చేశారబ్బా? అనేదే కదా డౌట్. కానీ ఈసారి కూడా మనోళ్లు ఆస్కార్ వేదిక పై సందడి చేశారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
Oscar Awards: దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బిగ్గెస్ట్ మల్టీస్టారర్ సినిమా ఆర్ఆర్ఆర్. బాక్సాఫీస్ దగ్గర 1300 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టిన ట్రిపుల్ ఆర్ సినిమా.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎన్నో అవార్డ్స్ సాధించింది. ఏకంగా ఆస్కార్ అవార్డ్ కొట్టేసి హిస్టరీ క్రియేట్ చేసింది. నాటు నాటు పాటకు ఆస్కార్ రావడంతో.. ఎన్టీఆర్, చరణ్‌కు గ్లోబల్ రేంజ్లో గుర్తింపు వచ్చింది. లాస్ట్ ఇయర్ ఆస్కార్ అవార్డ్స్ సమయంలో.. ప్రపంచ వ్యాప్తంగా చరణ్, ఎన్టీఆర్ గురించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఇక ఇప్పుడు కూడా ఆస్కార్ వేదిక పై సందడి చేశారు రామ్, భీమ్. తాజాగా ఈ ఏడాది జరిగిన అకాడమీ అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆస్కార్ స్టేజ్ స్క్రీన్‌పై నాటు నాటు పాట కనిపించింది. గతేడాది బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ‘నాటు నాటు’ పాట ఆస్కార్ అవార్డ్ గెలుచుకుంది. దీంతో ఈ ఏడాది ఉత్తమ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో అవార్డును ప్రకటించే సమయంలో.. స్క్రీన్‌పై ‘నాటు నాటు’ పాటను ప్లే చేశారు.
ఆస్కార్ వేదిక పై ఎన్టీఆర్, రామ్ చరణ్ కనిపించడంతో.. అందుకు సంబంధించిన వీడియో తెగ వైరల్ అయిపోయింది. అలాగే ఇప్పటి వరకు వచ్చిన సినిమాల్లోని బెస్ట్ స్టంట్స్‌కి సంబంధించిన ఓ స్పెషల్ వీడియోను కూడా ఆస్కార్ వేదికపై ప్రదర్శించారు. ఇందులో కూడా ‘ఆర్ఆర్ఆర్’లోని రెండు యాక్షన్ సీక్వెన్స్ షాట్స్‌ను చూపించారు. ఇదే విషయాన్ని చెబుతూ.. ట్రిపుల్ ఆర్ సోషల్ మీడియా హ్యాండిల్లో పోస్ట్ చేశారు. దీంతో ఈ ఏడాది కూడా ఆస్కార్ వేదికపై చరణ్, తారక్ సందడి చేశారని వైరల్ చేస్తున్నారు అభిమానులు. అన్నట్టు.. ఈ ఏడాది బెస్ట్ ఒరిజినల్ సాంగ్ అవార్డును ‘బార్బీ’ చిత్రంలోని ‘వాట్ వాస్ ఐ మేడ్ ఫర్’ పాట దక్కించుకుంది.