vijay : హీరో విజయ్ మంచి గాయకుడన్న సంగతి అందరికీ తెలిసిందే. తాజాగా ఆయన తన గొంతును మరోసారి సవరించుకోనున్నారు. ఈ విషయాన్ని స్వయంగా సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా(Yuvan Shankar Raja) వెల్లడించారు. ఆయన సంగీత దర్శకత్వం వహిస్తున్న ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం’ చిత్రం కోసం ఆయన పాట పాడుతున్నారని తెలిపారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న యువన్ ఈ విషయాన్ని వెల్లడించారు. దీంతో విజయ్(Vijay) అభిమానులు ఖుషీ అయిపోతున్నారు.
విజయ్ ఇప్పటి వరకు ఇళయరాజా, ఏఆర్ రెహ్మాన్, హరీష్ జయరాజ్, అనిరుధ్ వంటి ప్రముఖ సంగీత దర్శకుల మ్యూజిక్ డైరెక్షన్లో పాటలు పాడారు. ఇప్పుడు తాజాగా యువన్ శంకర్ రాజా దర్శకత్వం లోనూ పాడుతున్నారు. ఈ సినిమాలో విజయ్ తండ్రి, కొడుకుగా తానే ద్విపాత్రాభినయం చేస్తున్నారట.
విజయ్ ఇక సినిమాలకు గుడ్ బై చెప్పి రాజకీయ రంగ ప్రవేశం చేస్తారని వార్తలు వస్తున్నాయి. ఈ విషయం అభిమానులను ఎంతో బాధిస్తోందనే చెప్పాలి. దీంతో ఇప్పటికే ఒప్పుకున్న సినిమాలను ఆయన పూర్తి చేసే పనిలో ఉన్నారు. ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం సినిమాని జేజీఎస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తోంది. వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్నారు.