»90 Of Them Are Like That Criticism On The Director Of Fighter
Fighter: 90% అలాంటి వారే.. ‘ఫైటర్’ డైరెక్టర్ పై విమర్శలు!
జనవరి 25న బాలీవుడ్ నుంచి హృతిక్ రోషన్ నటించిన ఫస్ట్ ఏరియలో యాక్షన్ స్పై థ్రిల్లర్ 'ఫైటర్' సినిమా రిలీజ్ అయింది. సో.. సో.. టాక్ సొంతం చేసుకున్న ఫైటర్ సినిమా గురించి.. లేటెస్ట్గా డైరెక్టర్ చేసిన కామెంట్స్ పై విమర్శలు వస్తున్నాయి.
90% of them are like that.. Criticism on the director of 'Fighter'!
Fighter: లాస్ట్ ఇయర్ షారుఖ్ ఖాన్‌కు సాలిడ్ కంబ్యాక్ ఇస్తు.. పఠాన్ సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇచ్చాడు డైరెక్టర్ సిద్ధార్త్ ఆనంద్. సరిగ్గా మరో ఏడాది తర్వాత 2024 జనవరి 25న మరో అదిరిపోయే స్పై థ్రిల్లర్‌తో ఆడియెన్స్ ముందుకొచ్చాడు. హృతిక్ రోషన్‌ను ఫైటర్‌గా చూపిస్తూ సిద్దార్త్ చేసిన లేటెస్ట్ ఫిల్మ్ ఫైటర్. రిపబ్లిక్ డే సందర్భంగా థియేటర్లోకి వచ్చిన ఈ సినిమా అనుకున్నంత రీచ్ అందుకోలేకపోయింది. స్టార్టింగ్‌లో మంచి రెస్పాన్స్ వచ్చినప్పటికీ.. రోజు రోజుకి కలెక్షన్లు తగ్గుతున్నాయి. మొత్తంగా ఇప్పటి వరకు 151 కోట్లకు పైగా నెట్, 257 కోట్లు గ్రాస్ వసూలు చేసింది. 200 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో రిలీజ్ అయిన ఫైటర్.. మరో 50 కోట్లు నెట్‌ను రాబడితేనే హిట్ లిస్ట్‌లో చేరుతుంది. కానీ ప్రజెంట్ బుకింగ్స్‌ను బట్టి చూస్తే.. ఫైటర్ కష్టమే అంటున్నారు. ఈ నేపథ్యంలో సిద్దార్త్ ఆనంద్ చేసిన కామెంట్స్ కాంట్రవర్శీకి దారి తీసింది.
నెటిజన్స్ అతనిపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఆడియన్స్‌ను ఫైటర్ ఆకట్టుకోకపోవడానికి కారణమేంటి అని అడగ్గా.. అది ఆడియెన్స్ ఫాల్ట్ అనేలా మాట్లాడాడు. ‘ఇలాంటి స్టోరీతో ఇప్పటివరకూ సినిమా రాలేదు.. గతంలోను చూసి ఉండరు. ఆడియెన్స్‌కే సినిమా చూడడం రాలేదని, మన దేశంలో దాదాపు 90% మంది విమానమే ఎక్కి ఉండరు. అసలు ఎయిర్పోర్ట్ కూడా చూసుండరు. అలాంటి వాళ్లకి ఏరియల్ యాక్షన్ సినిమా చూపిస్తే ఎలా అర్థమవుతుంది? అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో సిద్ధార్త్ను ఓ రేంజ్లో ట్రోల్ చేస్తున్నారు. ఆడియెన్స్‌కి అర్థం కాకుండా సినిమా ఎందుకు తీశావ్? అంటు ఫైర్ అవుతున్నారు. అయినా.. ఇదేం లాజిక్ సిద్ధార్త్.. ఫ్లైట్ ఎక్కలేదని, సినిమా అర్థం కాకపోవడమేంటి?