Poonam Pandey, who said she died for cervical cancer awareness, is alive
Poonam Pandey: శృంగార తారా, నేకిడ్ బ్యూటీగా పేరున్న పూనమ్ పాండే(Poonam Pandey) మరణించిన వార్త బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో, మోడల్ ఇండస్ట్రిలో తీవ్ర రచ్చ జరిగింది. మొదటి నుంచి వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రాస్‌గా నిలిచిన ఈ అందాల భామ చనిపోయిందన వార్త తన అభిమానుల్లో తీవ్ర కలవరాన్ని సృష్టించింది. తన మేనేజరే ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా చెప్పడంతో ఒకింత నమ్మాల్సిన పరిస్థితి అయినా ఇది పబ్లిసిటీ స్టంటేమో అనే అనుమానం కూడా ఉండింది. ఒక వేల తాను చనిపోయినట్లైతే తన బాడీ ఎక్కడా అనే కామెంట్లు నిన్నంత సోషల్ మీడియాను కుదిపేశాయి. అలాగే జాతీయ స్థాయి మీడియాలు కూడా పెద్దగా ఈ విషయం గురించి మాట్లాడలేదు. కానీ ఒక విషయం మాత్రం వెలుగులోకి వచ్చింది. అదే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్. అదే సెర్వైకల్ క్యాన్సర్(cervical cancer).
తాజాగా తానో వీడియోను విడుదల చేసింది. హే ఆల్.. నేను పూనమ్ పాండేను బతికే ఉన్నాను, సెర్వైకల్ క్యాన్సర్ తో నేను చనిపోలేదు కానీ వేలాది మంది మహిళలు చనిపోతున్నారు. దీన్ని నివారించడం సాధ్యమే అయినప్పటికీ సరైన అవగాహన లేదు, హెచ్ పీవీ వ్యాక్సిన్ తీసుకోవడం లేదా ముందుస్తుగా గుర్తించి చికిత్స తీసుకుంటే వేలాది మంది మహిళలు తమ ప్రాణాలను కాపాడుకోవచ్చు అని తెలిపింది. తన వలన బాధ పడిన వారికి సారీ చెబుతూ.. కేవలం దీనిపై అవగాహన కల్పించడం కోసమే ఇలా చేశాను అని వెల్లడించింది.
పూనమ్ పాండే 2011లో జరుగుతున్న క్రికెట్ ప్రపంచ వరల్డ్ కప్ లో తొలిసారిగా తన పేరు వినిపించింది. ఇండియా వరల్డ్ కప్ గెలిస్తే వాంఖడే స్టేడియంలో న్యూడ్‌గా తిరుగుతాను.. అని సంచలన ప్రకటన చేసింది పూనమ్. అప్పటి నుంచి పూనమ్ అంటే ఓ సెన్సేషన్‌గా మారింది. తరువాత 2013లో నషా అనే చిత్రంలో నటించింది. తన అందచందాలతో కుర్రళ్లకు నిద్రలేకుండా చేసింది. అప్పటి నుంచి శృంగార తారగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇన్ ఫ్ల్యూయెన్సర్ గా, మోడల్ గా, రియాలిటీ షోలతో అలరిస్తోంది. ఇక తాను సెర్వైకల్ క్యాన్సర్ అవగాహన కోసం తాను ఏకంగా చనిపోయినట్లు ప్రకటించి దేశం మొత్తాన్ని ఆ వ్యాధి గురించి చర్చించేలా చేసింది.