బాలీవుడ్లో సెన్సేషన్ క్రియేట్ చేసిన పూనమ్ పాండే.. 32 ఏళ్లకే తనువు చాలించింది. దీంతో సోషల్ మీడియాలో ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని పోస్ట్‌లు పెడుతున్నారు నెటిజన్స్. ఇదే సమయంలో గతంలో పూనమ్ సెన్సేషన్ క్రియేట్ చేసిన న్యూడ్ స్టోరీ వైరల్ అవుతోంది.
Poonam Pandey: శృంగారతారగా పూనమ్ ఎంత గుర్తింపు తెచ్చుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొన్నాళ్లుగా గర్భాశయ క్యాన్సర్‌తో బాధపడుతున్న పూనమ్ మరణించిందనే వార్త విని ఆమె అభిమానులు షాక్ అయ్యారు. కానీ ఈ విషయాన్నీ ఆమె మేనేజర్ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. దీంతో బాలీవుడ్లో విషాద ఛాయలు అలముకున్నాయి. 32 ఏళ్ళ వయస్సులోనే పూనమ్ కన్నుమూసింది. అతి చిన్న వయస్సులోనే ఆమె చనిపోవడం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నారు. అయితే అసలు పూనమ్ సెన్సేషన్ క్రియేట్ చేసిన న్యూడ్ స్టోరీ మరోసారి వైరల్ అవుతోంది. పూనమ్ ఒక శృంగార తార అనే చెప్పాలి. అందాల ఆరబోతలో ఏ మాత్రం వెనకడుగు వేయని పూనమ్ మోడల్‌గా కెరీర్‌ను ప్రారంభించింది. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో జన్మించిన పూనమ్.. 2010లో గ్లాడ్‌రాక్స్ పత్రిక నిర్వహించిన అందాల భామల పోటీలో తొలి 8 మందిలో ఒకరిగా నిలిచింది.
ఆ తర్వాత ఫ్యాషన్ మేగజిన్ కవర్ పేజీపై అందాలను ఆరబోసి బాలీవుడ్‌ని అట్రాక్ట్ చేసింది. అయితే 2011 వరల్డ్ కప్ పూనమ్ జీవితాన్ని మార్చేసింది. 2011లో జరిగిన క్రికెట్ వరల్డ్ కప్ సమయంలో.. ఇండియా వరల్డ్ కప్ గెలిస్తే వాంఖడే స్టేడియంలో న్యూడ్‌గా తిరుగుతాను.. అని సంచలన ప్రకటన చేసింది పూనమ్. ఇక ఇండియా గెలిచింది.. పూనమ్ నగ్నంగా తిరగడానికి రెడీ అయ్యింది. కానీ, స్టేడియంలో ఒక అమ్మాయి నగ్నంగా తిరగడాన్ని బీసీసీఐ ఒప్పుకోలేదు. అయినా కూడా మాట తప్పకుండా.. ఎవరు లేని సమయంలో నగ్నంగా తిరిగి వీడియో రిలీజ్ చేసింది పూనమ్. అప్పటి నుంచి పూనమ్ అంటే ఓ సెన్సేషన్‌గా మారింది. శృంగార తారగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ హోస్ట్ చేసిన లాకప్ షోలో పూనమ్ కంటెస్టెంట్‌గా వెళ్లి సంచలనం సృష్టించింది. అయితే.. 2020లో సామ్ బాంబేను ప్రేమ పెళ్లి చేసుకున్న పూనమ్.. తక్కువ సమయంలోనే విడాకులు తీసుకుంది.