»Mythri Movie Makers Ok And What Will Koratala Say
Srimantudu: మైత్రీ మూవీ మేకర్స్ సరే.. మరి కొరటాల ఏం చెబుతాడు?
ప్రస్తుతం కొరటాల శివ 'దేవర' సినిమాతో బిజీగా ఉన్నాడు. ఆచార్య తర్వాత కొరటాల చేస్తున్న సినిమా కావడంతో.. దేవర పై అంచనాలు భారీగా ఉన్నాయి. కొరటాలకు దేవర ప్రెస్టిజీయస్ ప్రాజెక్ట్. కానీ శ్రీమంతుడు కాపీ రైట్స్ ఇష్యూ మాత్రం కొరటాలను ఇబ్బంది పెడుతోంది.
Srimantudu: ఆచార్య సినిమాతో కెరీర్లో ఫస్ట్ బిగ్గెస్ట్ డిజాస్టర్ చూశాడు కొరటాల. మామూలుగా అయితే ఆచార్య రిజల్ట్ చూసిన తర్వాత ఏ హీరో కూడా సినిమా చేయడానికి సాహసం చేయరు. కానీ యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాత్రం కొరటాలను గట్టిగా నమ్మాడు. అందుకే దేవర సినిమాను ఓ ఛాలెంజ్‌గా చేస్తున్నాడు కొరటాల. సమ్మర్లో ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉండగా.. ఎలక్షన్స్ కారణంగా పోస్ట్ పోన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. త్వరలోనే దేవర కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు. ఇదిలా ఉంటే.. మహేష్ బాబుతో కొరటాల శివ చేసిన శ్రీమంతుడు సినిమా సూపర్ డూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. అయితే.. గత కొద్ది రోజులుగా శ్రీమంతుడు కాపీరైట్ వివాదం నడుస్తోంది. ఈ కేసు విషయంలో తన మీద ఎలాంటి క్రిమినల్ చర్యలు తీసుకోకుండా చూడాలని కొరటాల శివ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. కానీ ఈ విషయంలో తామేమీ చేయలేము సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఈ క్రమంలో.. ఈ కేసు వేసిన రైటర్ శరత్ చంద్ర పలు చానల్స్‌కి ఇంటర్వ్యూ ఇస్తున్నారు.
ఈ నేపథ్యంలో.. రకరకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వివాదం ఎట్టకేలకు మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఒక నోట్ రిలీజ్ చేసింది. కొరటాల శివ డైరెక్ట్ చేసిన శ్రీమంతుడు సినిమా.. రైటర్ శరత్ చంద్ర చెబుతున్న చచ్చేంత ప్రేమ నవల లాగానే ఉంటుందని కేసు వేశారు. అయితే ఈ రెండు ప్రస్తుతానికి పబ్లిక్ డొమైన్స్‌లో అందుబాటులో ఉన్నాయి. ఈ రెండింటికి ఎలాంటి సంబంధం లేదు. కానీ ఈ ఇష్యూ ప్రస్తుతానికి కోర్టు పరిధిలో ఉన్న ఉండడంతో.. లీగల్ ప్రాసెస్ మీద మాకు ఉన్న నమ్మకం కారణంగా.. కోర్టు ఏం చెబుతుందో అది చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అప్పటి వరకు దయచేసి ఈ విషయం మీద ఎలాంటి వార్తలు వ్యాప్తి చేయవద్దని విజ్ఞప్తి.. అంటూ రాసుకొచ్చారు. అయితే మైత్రి మూవీ మేకర్స్ సంస్థ స్పందించి కానీ.. కొరటాల శివ ఈ ఇష్యూపై ఎప్పుడు స్పందిస్తాడు? ఏ చెబుతాడు అనేది వేచి చూడాల్సిందే.