»Megastar Vishwambhara Release Date Fixed For Next Sankranti
Vishwambhara: 2025 సంక్రాంతి ఫస్ట్ సినిమా లాక్!
సంక్రాంతి అంటే సినిమా సీజన్. పోయిన సంక్రాంతికి నాలుగు సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇక ఇప్పుడు 2025 సంక్రాంతి పోరు మొదలైంది. ఇప్పటి నుంచే సంక్రాంతికి వస్తున్నామంటు రిలీజ్ డేట్స్ లాక్ చేసే పనిలో ఉన్నారు. ముందుగా మెగాస్టార్ సంక్రాంతి బరిలో సై అనేశాడు.
Megastar Vishwambhara release date fixed for next Sankranti
Vishwambhara: పోయిన సంక్రాంతికి గుంటూరు కారం, హనుమాన్, సైంధవ్, నా సామిరంగా సినిమాలు రిలీజ్ అవగా.. రవితేజ ‘ఈగల్’ మూవీ థియేటర్లో సమస్య కారణంగా వాయిందా పడింది. దీంతో నెక్స్ట్ సంక్రాంతిని ఇప్పటి నుంచే టార్గెట్ చేస్తున్నారు మేకర్స్. ముందుగా మెగాస్టార్ చిరంజీవి సంక్రాంతి రేసులో బెర్త్ కన్ఫామ్ చేసుకున్నారు. భోళా శంకర్ వంటి ఫ్లాప్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి హీరోగా చేస్తున్న సినిమా విశ్వంభర. బింబిసార ఫేమ్ వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా సోషియో ఫాంటసీగా రూపొందుతోంది. మెగాస్టార్ కెరీర్లోనే హైయెస్ట్ బడ్జెట్‌తో యూవీ క్రియేషన్స్ బ్యానర్ రూపొందిస్తోంది. కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నాడు. తాజాగా విశ్వంభర సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు.
సంక్రాంతి కానుకగా 2025 జనవరి 10న విశ్వంభర సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందని చిత్ర యూనిట్ సోషల్ మీడియా ద్వారా తెలిపింది. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పవర్ఫుల్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటికే విశ్వంభర షూటింగ్ స్టార్ట్ అయింది. అయితే చిరంజీవి ఇంకా సెట్స్‌లోకి అడుగు పెట్టలేదు. దీంతో మొన్న ఈ సినిమా కోసం మెగాస్టార్ చిరంజీవి జిమ్‌లో వర్కౌట్స్ చేస్తున్న వీడియోను షేర్ చేశారు. ఇక ఇప్పుడు విశ్వంభర సెట్స్‌లోకి మెగాస్టార్ అడుగు పెట్టినట్టుగా తెలిపుతూ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్. ఇక ఈ సినిమాలో అనుష్క శెట్టి, మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటించనున్నారనే వార్తలు వస్తున్నాయి. కానీ ఇంకా క్లారిటీ లేదు. హీరోయిన్ల విషయంలో కూడా త్వరోలనే అధికారిక ప్రకటన ఉండనుంది.