ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ 'దేవర' సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఆ తర్వాత హృతిక్ రోషన్‌తో కలిసి 'వార్ 2'షూటింగ్లో జాయిన్ అవడానికి రెడీ అవుతున్నాడు. ఈసారి ఎన్టీఆర్, హృతిక్ యుద్ధం హైదరాబాద్‌లోనే అని తెలుస్తోంది.
NTR-Hrithik Roshan: 'NTR-Hrithik Roshan' movie in Hyderabad?
NTR-Hrithik Roshan: ఇప్పటి వరకు ఇండియాలో.. అసలు ఎవ్వరు ఊహించని కాంబినేషన్ ఏదైనా ఉందా? అంటే, అది ఎన్టీఆర్-హృతిక్ రోషన్ కాంబో అని మాత్రమే చెప్పాలి. వార్ 2 అనౌన్స్మెంట్తోనే పిచ్చెక్కిపోయేలా చేశారు మేకర్స్. హృతిక్‌తో ఎన్టీఆర్ స్క్రీన్ షేరింగ్ అనేసరి.. ఇండియాస్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్‌గా మారిపోయింది వార్2. అంతేకాదు.. ఈ సినిమాలో ఎన్టీఆర్ నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేస్తున్నాడు. దీంతో.. వార్ 2 కోసం యావత్ ప్రపంచం ఈగర్‌గా వెయిట్ చేస్తోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది.
ముంబైలో ఎన్టీఆర్, హృతిక్ పై భారీ యాక్షన్స్ సీక్వెన్స్‌తో పాటు ఓ హై ఓల్టేజ్ సాంగ్ కూడా షూట్ చేశారు. ఇక ఇప్పుడు మరో యుద్ధానికి రెడీ అవుతున్నారు ఎన్టీఆర్, హృతిక్. అయితే.. ఈసారి యుద్ధం మాత్రం హైదరాబాద్‌లోనే అని తెలుస్తోంది. ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ హైదరాబాద్‌లో ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే రామోజీ ఫిలిం సిటీలో భారీ బడ్జెట్‌తో ఓ సెట్ కూడా వేస్తున్నారట.
ఆగస్టులో ఈ షెడ్యూల్ స్టార్ట్ కానుందని సమాచారం. ఈ షెడ్యూల్లో హృతిక్ రోషన్, ఎన్టీఆర్‌ల మధ్య భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఈ ఫైట్ సీక్వెన్స్ ఇంటర్వెల్ బ్యాంగ్ అని తెలుస్తోంది. ఇది సినిమాకే హైలైట్‌గా ఉండనుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఇక యశ్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్‌లో భాగంగా ‘వార్-2’ని తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు అయాన్ ముఖర్జీ. 2025 ఆగష్టులో ఈ సినిమా రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. మరి భారీ అంచనాలున్న ‘వార్ 2’ ఎలా ఉంటుందో చూడాలి.