SKLM: పాతపట్నం మండలం సోద గ్రామంలో ఉన్న శ్రీ నీల కంఠేశ్వర స్వామివారి 22వ వార్షికోత్సవ మహోత్సవాలు కమిటీ సభ్యులు ఘనంగా నిర్వహిస్తున్నారు. కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు సోమవారం స్థానిక ఎమ్మెల్యే గోవిందరావు స్వామివారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ఆవరణలో జరిగిన అన్నసంతర్పణ కార్యక్రమంలో పాల్గొని భక్తులకు వడ్డించారు.