మహబూబ్ నగర్: విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని రేణుక ఎల్లమ్మ దేవాలయంలో మాజీ మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్ ఇవాళ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అమ్మవారి ఆశీస్సులు నియోజకవర్గ ప్రజలపై ఉండాలని కాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ MUDA ఛైర్మన్ గంజి వెంకన్న, నాయకులు కిషోర్ తదితరులు పాల్గొన్నారు.
BDK: భద్రాచలం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఇవాళ స్వతంత్ర సమరయోధులు మహాత్మ గాంధీ జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు పూలమాల వేసి నివాళి అర్పించారు. గాంధీ అనుసరించిన సత్యమార్గాన్ని మనందరం అనుసరిస్తే రాగద్వేషాలు లేకుండా జీవించవచ్చని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.
BHPL: తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్, గురువారం సాయంత్రం మరిపెడ మండలానికి రానున్నారు. మండల కేంద్రంలో సా. 5:30 కి జరిగే దసరా వేడుకలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరవుతారని, ప్రభుత్వ విప్, డోర్నకల్ MLA డా. జాటోతు రామచంద్రనాయక్ సైతం పాల్గొంటారని స్థానిక కాంగ్రెస్ నాయకులు తెలిపారు. వీరి పర్యటనతో పాటు దసరా వేడుకలు విజయవంతం చేయాలని కోరారు.
ADB: విజయదశమి వేడుకలను జిల్లావ్యాప్తంగా ప్రజలు ప్రశాంత వాతావరణంలో, భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించుకోవాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ కోరారు. ఉదయం స్థానిక పోలీస్ హెడ్ క్వార్టర్స్‌ని ఆయుధ భాండాగార మందిరంలో ఎస్పీ, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు. వేద పండితుల శాస్త్రోక్తాల మధ్య దుర్గామాత సన్నిధిలో సాంప్రదాయబద్ధంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.
NZB: నిజామాబాద్ ఎంపీ, బీజేపీ నేత ధర్మపురి అర్వింద్ అందరికీ దసరా శుభాకాంక్షలు తెలిపారు. జలుబు, గొంతు నొప్పి కారణంగా ఈ రోజు ఫోన్ కాల్స్‌కు సమాధానం ఇవ్వలేనని, అయితే తన అభిమానులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని ఆయన గురువారం ఎక్స్ (ట్విట్టర్) వేదికగా పేర్కొన్నారు. దసరా పర్వదినం సందర్భంగా ఆయన అభిమానులకు, ప్రజలకు తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
వనపర్తి: పట్టణంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి గాంధీ చౌక్‌లోని మహాత్మగాంధీ విగ్రహానికి దేశ రెండవ ప్రధాని లాల్ బహుదూర్ శాస్త్రి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సత్యం, అహింస మార్గంలో దేశానికి స్వాతంత్య్రాన్ని సాధించి పెట్టిన బాపూజీ జీవితం, బోధనలు యావత్ మానవాళికి మార్గదర్శకం అని పేర్కొన్నారు.
KMM: గాంధీజీ అడుగుజాడల్లో ప్రతి ఒక్కరు నడవాలని, స్వాతంత్య్ర పోరాటంలో గాంధీజీ పాత్ర మరువలేనిదని ఎమ్మెల్యే మట్టా రాగమయి తెలిపారు. గురువారం జాతిపిత మహాత్మాగాంధీ, లాల్ బహుదూర్ శాస్త్రి జయంతి సంధర్భంగా సత్తుపల్లిలోని మెయిన్ రోడ్‌లో గల గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. గాంధీ అహింస మార్గంతోనే దేశానికి స్వాతంత్య్రం సాధించామని చెప్పారు.
NRML: గురువారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులు లాల్ బహదూర్ శాస్త్రి, మహాత్మా గాంధీల జయంతి సందర్భంగా చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. స్వాతంత్రోద్యమంలో వీరి పాత్ర అపూర్వమని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా పట్టణ బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
KMNR: కరీంనగర్ మహాశక్తి ఆలయంలో విజయదశమి దసరా పండగ వేడుకలు గురువారం ఘనంగా జరిగాయని ఆలయ అర్చకులు అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మా శక్తి ఆలయంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ శమీ పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
SRPT: సూర్యాపేట జిల్లాలో ఒక కొత్త చర్చ మొదలైంది. సర్పంచ్ కావాలనుకునే నాయకులు ఇప్పుడు అభివృద్ధి పనుల కంటే ‘కోతుల బాధ’పై దృష్టి పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. పంట పొలాలు, ఇళ్లు, పల్లెలు, గల్లీల్లో విస్తారంగా తిరుగుతున్న కోతుల గుంపులు రైతులకు, గ్రామస్థులకు తలనొప్పిగా మారాయి. సర్పంచ్ కావాలంటే కోతులను పట్టాల్సిందేనని గ్రామస్తులు తెలిపారు.
MBNR: జడ్చర్ల మండల పరిషత్ కార్యాలయంలో స్వాతంత్య్ర సమరయోధుడు, ‘జడ్చర్ల గాంధీ’గా పేరొందిన కొత్త కేశవులు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి హాజరై ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. స్వాతంత్య్రం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుల త్యాగాలను స్మరించుకోవడం మనందరి బాధ్యతని పేర్కొన్నారు.
సిద్దిపేట రూరల్ పోలీస్ స్టేషన్ చౌరస్తాలో గల శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో మాజీ మంత్రి హరీష్ రావు స్వామి వారికి వెండి కిరీటాన్ని గురువారం సమర్పించారు. ఈ సందర్భంగా స్వయంగా స్వామి వారికి కిరీట ధారణ చేసి పూజలు నిర్వహించారు. విజయదశమి పర్వదినాన ప్రజలందరికీ అన్నింటా విజయం చేకూరాలని స్వామి వారిని ప్రార్థించినట్లు తెలిపారు.
MDK: దసరా పండుగను పురస్కరించుకొని రామయంపేట సీఐ వెంకటరాజా గౌడ్ నిజాంపేట మండల పరిధిలో శ్రీ తిరుమల స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన రామయంపేట సర్కిల్ ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. గ్రామాలలోని ప్రజలందరూ పండుగను శాంతియుత వాతావరణంలో ఆనందంగా జరుపుకోవాలని సూచించారు.
JGL: ఎన్నికల కమిషన్ గైడ్ లైన్స్ ప్రకారం పోలీస్ సిబ్బంది సిద్ధంగా ఉండాలని జిల్లా SP అశోక్ కుమార్ తెలిపారు. సమస్యాత్మకమైన గ్రామాల్లో తరచూ సందర్శించి నిఘా ఉంచాలన్నారు. విలేజ్ పోలీస్ ఆఫీసర్స్ తమకు కేటాయించిన గ్రామల్లో విధిగా పర్యటించాలన్నారు. స్థానిక ఎన్నికలు సజావుగా జరగడానికి కావలసిన అన్నిరకాల ముందస్తు ఏర్పాట్లను చేసుకోవాలన్నారు.