• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

విజయదశమిన బీఆర్‌ఎస్‌లోకి భారీ చేరికలు

GDWL: విజయదశమి పర్వదినం సందర్భంగా కె.టి.దొడ్డి మండల కేంద్రానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు ఇవాళ బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. పట్టణంలోని నియోజకవర్గ బీఆర్‌ఎస్ పార్టీ ఇన్‌ఛార్జ్ బాసు హనుమంతు నాయుడు స్వగృహంలో పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ​కాంగ్రెస్ పార్టీ నాయకులు కురువ సురేష్, గద్వాల కిష్టప్ప, పాలెం తిమ్మప్ప తదితరులు పాల్గొన్నారు.

October 2, 2025 / 02:11 PM IST

నిజాంపేటలో ఘనంగా గాంధీ జయంతి

MDK: నిజాంపేట మండల కేంద్రంలో గాంధీ జయంతిని పురస్కరించుకొని శ్రీ దుర్గామాత ఉత్సవ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. సత్యమేవ జయతే ఆయుధంగా ఆహింస మార్గంలో పోరాడి కోట్లాది భారతీయులకు స్వేచ్ఛను అందించిన జాతిపిత అని కొనియాడారు.

October 2, 2025 / 02:05 PM IST

గాంధీ చూపిన మార్గంలో నడవాలి: ఎమ్మెల్యే

NZB: ప్రతీ ఒక్కరూ గాంధీ చూపిన మార్గంలో నడవాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా అన్నారు. గురువారం గాంధీ జయంతి గాంధీ చౌక్ వద్ద గల ఆయన విగ్రహానికి నివాళులు అర్పించారు. ఆయన మాట్లాడుతూ.. గాంధీజీ అహింసా మార్గంలో నడిచి, ఎందరికో స్ఫూర్తిగా నిలిచారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో నాగోళ్ల లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.

October 2, 2025 / 02:02 PM IST

ఐదో శక్తి పీఠాన్ని దర్శించుకున్న ఎస్పీ

GDWL: విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఎస్పీ టి.శ్రీనివాసరావు గురువారం కుటుంబ సమేతంగా అలంపూర్ ఐదో శక్తిపీఠం జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను దర్శించుకున్నారు. దేవస్థానం అధికారులు వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ​అర్చకులు తీర్థప్రసాదాలు అందజేసి, ఆశీర్వచన మండపంలో శేషవస్త్రంతో సత్కరించారు.

October 2, 2025 / 02:01 PM IST

హయత్ నగర్‌లో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు

RR: హయత్‌నగర్ డివిజన్‌లో గాంధీ, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి గాంధీ విగ్రహానికి, లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..  మాజీ ప్రధాని లాల్ బహదూర్ దేశం గర్వించదగ్గ నాయకుడన్నారు. కోట్లాది భారతీయులకు గాంధీ స్వేచ్ఛ, స్వతంత్రన్ని అందించారన్నారు.

October 2, 2025 / 01:55 PM IST

ఎస్పీ కార్యాలయంలో గాంధీ, శాస్త్రి జయంతి వేడుకలు

GDWL: జిల్లా పోలీస్ కార్యాలయంలో గురువారం జాతిపిత మహాత్మా గాంధీ, భారత దేశ రెండవ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎస్పీ టి.శ్రీనివాస రావు వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ​ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహాత్మా గాంధీ సత్యం, అహింస అనే సిద్ధాంతాలతో దేనినైనా సాధించవచ్చని నిరూపించారని కొనియాడారు.

October 2, 2025 / 01:54 PM IST

దసరా పండుగను సంతోషంగా జరుపుకోవాలి: తహసీల్దార్

MDK: రామాయంపేట మండలం ప్రజలందరూ గాంధీ జయంతిని పురస్కరించుకొని ప్రజలు మద్యం మాంసంకు దూరంగా ఉండాలని తహసీల్దార్ రజనీకుమారి సూచించారు. దసరా పండుగ సందర్భంగా మాట్లాడుతూ.. మండల ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు తెలిపారు. దసరా పండుగను సంతోషంగా జరుపుకోవాలని సూచించారు. దేవిశరన్నవరాత్రి ఉత్సవాలు సందర్భంగా నిమజ్జనం వేడుకల్లో జాగ్రత్తలు పాటించాలన్నారు.

October 2, 2025 / 01:52 PM IST

తెలుగు గూడెంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు

మహబూబ్ నగర్ రూరల్ మండలం తెలుగు గూడెం గ్రామంలో గాంధీ జయంతి వేడుకలను ఇవాళ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ కాంగ్రెస్ నేత రామచంద్రయ్య మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మహాత్మా గాంధీ స్ఫూర్తితో యువత ముందుకు సాగాలని, అహింసతోనే విజయం సాధ్యమని పేర్కొన్నారు.

October 2, 2025 / 01:46 PM IST

అమ్మవారికి భక్తిశ్రద్ధలతో కుంకుమార్చన

WNP: కొత్తకోట మండలం కానాయిపల్లిలోని సుప్రసిద్ధ శైవ క్షేత్రం శ్రీ కోటి లింగేశ్వర దత్త ఆలయంలో 10వరోజు గురువారం జ్ఞానాంబికాదేవి మహిషాసురమర్దిని అవతారంలో దర్శనమిచ్చారు. మహిళ భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారికి సహస్రనామ స్తోత్ర పారాయణంతో కుంకుమార్చనలు చేశారు. అనంతరం ధూప దీప నైవేద్యాలతో మహా మంగళహారతి సమర్పించారు.  అనంతరం ఆలయ అర్చకులు భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు.

October 2, 2025 / 01:41 PM IST

‘అహింసా మార్గంలోనే దేశానికి స్వాతంత్య్రం’

వనపర్తి: జాతిపిత మహాత్మ గాంధీ జయంతి వేడుకలను జిల్లాల్లోని ఆర్టీసీ డిపోలో ఘనంగా నిర్వహించారు. జిల్లా ఆర్టీసీ డిపో మేనేజర్ దేవేందర్ గౌడ్ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గాంధీ అహింసా మార్గంతోనే దేశానికి స్వాతంత్య్రం సాధించారని, ప్రతిఒక్కరూ మహాత్ముడుని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని తెలిపారు.

October 2, 2025 / 01:40 PM IST

రాజావారితో ఎమ్మెల్యే ప్రత్యేక సమావేశం

వనపర్తి రాజావారు రాజా కృష్ణదేవరావుతో ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ఇవాళ ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన రాజావారికి దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం వనపర్తి సంస్థానాధిశుల కాలం నుంచి నేటి వరకు ఉన్న పలు అభివృద్ధి అంశాలపై వారు చర్చించుకున్నారు. అనంతరం రాజావారు ఏర్పాటు చేసిన తేనేటి విందులో ఎమ్మెల్యే పాల్గొన్నారు.

October 2, 2025 / 01:38 PM IST

పోలీస్ ప్రధాన కార్యాలయంలో గాంధీ జయంతి వేడుకలు

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఇవాళ గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ జానకి మహాత్మ గాంధీ చిత్రపటానికి పూలమాలలతో ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. హింస ద్వారా ఎటువంటి విజయం సాధించలేమని, అహింస ద్వారానే ఏదైనా సాధించవచ్చని నిరూపించిన వ్యక్తి గాంధీ అని పేర్కొన్నారు.

October 2, 2025 / 01:36 PM IST

‘ప్రతి ఒక్కరు గాంధీ సిద్ధాంతాలను ఆదరించాలి’

నాగర్ కర్నూల్ పట్టణంలోని గాంధీ పార్క్ వద్ద మహాత్మా గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సత్యం, అహింస, సమానత్వం కోసం గాంధీ చేసిన పోరాటాన్ని స్మరించుకుంటూ, ప్రతి ఒక్కరూ ఆయన సిద్ధాంతాలను ఆదరించాలని పిలుపునిచ్చారు.

October 2, 2025 / 01:33 PM IST

అదుపు తప్పి ఆటో బోల్తా.. ఇద్దరి వ్యక్తులకు గాయాలు

WGL: వర్ధన్నపేట మండలం కొత్తపల్లి గ్రామం శివారు గురువారం ఆటో బోల్తా పడింది. బైక్‌ను తప్పించబోయి ఆటో అదుపు తప్పి ఆటో బోల్తా పడింది. ఆటోలో ప్రయాణిస్తున్న ఒక వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా, మరో వ్యక్తికి స్వల్ప గాయాలు అయ్యాయి. స్థానికులు వారిని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.

October 2, 2025 / 01:30 PM IST

ప్రభుత్వాసుపత్రిలో రోగులకు పండ్లను పంపిణీ

NLG: మాజీ ఎమ్మెల్యే & రాష్ట్ర మాజీ ఆగ్రోస్ ఛైర్మన్ తిప్పన విజయసింహారెడ్డి పుట్టినరోజును పురస్కరించుకుని స్థానిక ప్రభుత్వాసుపత్రిలో రోగులకు పండ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే భాస్కరరావు పాల్గొని పంపిణీ చేశారు. అలాగే లయన్స్ క్లబ్ వారు 69 రోజుల నుంచి ఈ కార్యక్రమం చెయ్యడం చాలా గొప్ప విషయం అని మాజీ ఎమ్మెల్యే భాస్కరరావు అన్నారు.

October 2, 2025 / 01:29 PM IST