GDWL: విజయదశమి పర్వదినం సందర్భంగా కె.టి.దొడ్డి మండల కేంద్రానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. పట్టణంలోని నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ బాసు హనుమంతు నాయుడు స్వగృహంలో పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కురువ సురేష్, గద్వాల కిష్టప్ప, పాలెం తిమ్మప్ప తదితరులు పాల్గొన్నారు.