WGL: వర్ధన్నపేట మండలం కొత్తపల్లి గ్రామం శివారు గురువారం ఆటో బోల్తా పడింది. బైక్ను తప్పించబోయి ఆటో అదుపు తప్పి ఆటో బోల్తా పడింది. ఆటోలో ప్రయాణిస్తున్న ఒక వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా, మరో వ్యక్తికి స్వల్ప గాయాలు అయ్యాయి. స్థానికులు వారిని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.