MNCL: జన్నారం మండలంలోని దేవునిగూడెం రైతు వేదిక వద్దకు క్లస్టర్ పరిధిలోని పలు గ్రామాల రైతులు తరలివచ్చారు. రైతుల అవసరార్థం ప్రభుత్వం బుధవారం ఉదయం లారీ ద్వారా 444 యూరియా బస్తాలను సరఫరా చేసింది. దీంతో టోకెన్లు జారీ చేయబడిన రైతులకు స్థానిక ఏఈవో అక్రమ్ యూరియా బస్తాలను అందజేశారు. రైతులకు అవసరమైన యూరియా బస్తాలను అందజేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన వెల్లడించారు.
SRCL: స్థానిక సంస్థల ఎన్నికల రిత్యా అన్ని రాజకీయ పార్టీల నాయకులు సహకరించాలని తంగళ్ళపల్లి ఎంపీడీవో లక్ష్మీనారాయణ అన్నారు. తంగళ్ళపల్లిలోని ఎంపీడీవో కార్యాలయంలో అన్ని రాజకీయ పార్టీ నాయకులతో బుధవారం ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్ని రాజకీయ పార్టీలు, నాయకులు శాంతియుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడానికి సహకరించాలని ఆయన స్పష్టం చేశారు.
HYD: విజయదశమి సందర్భంగా నేడు HYDలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆయుధ పూజ నిర్వహించారు. మనకు ఆహారం అందించే హలం, మనం ప్రయాణించే వాహనం, దేశాన్ని కాపాడే ఆయుధం సాధనం ఏదైనా అది దైవస్వరూపమే అని మంత్రి అన్నారు. అర్జునుడు వనవాసంలో దాచిన తన ఆయుధాలను విజయ దశమి రోజునే తిరిగి పొందారన్నారు.
PDPL: కలెక్టర్ కోయ శ్రీహర్షను ఇటీవల నియమితులైన గ్రూప్-1 అధికారి ఏగుమామిడి అఖిల్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. SRCL చందుర్తి మండలం మర్రిగడ్డ గ్రామానికి చెందిన అఖిల్ రెడ్డి 475.5 మార్కులతో 176వ ర్యాంక్ సాధించి అసిస్టెంట్ ఆడిట్ అధికారిగా ఎంపికయ్యారు. సీఎం చేతుల మీదుగా నియామక ఆదేశాలు స్వీకరించారు.
ADB: కేంద్రంలో జరగనున్న దసరా ఉత్సవాల ఏర్పాట్లను బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి పరిశీలించారు. ఆయన ముందుగా బంగల్ పేట్ మహాలక్ష్మి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం ఉత్సవాలు, దుర్గా నిమజ్జన శోభాయాత్రకు సంబంధించిన ఏర్పాట్లను సమీక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నల్ల ఇంద్రకరణ్ రెడ్డి తుదితులు పాల్గొన్నారు.
RR: రాజేంద్రనగర్ పరిధిలోని పంచవటి కాలనీలో నిర్వహించిన నవరాత్రి ఉత్సవ వేడుకలలో మహేశ్వరం నియోజకవర్గ BRS పార్టీ నాయకులు కార్తీక్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారు రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్టుగా తెలిపారు. వేలాది మంది భక్తులు ఈ ఉత్సవాలలో పాల్గొన్నారు.
KMM: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నియమించే అభ్యర్థులను గెలిపించాల్సిన బాధ్యత పార్టీ నేతలు కార్యకర్తలపై ఉందని మాజీ ఎమ్మెల్యే బానోతు హరిప్రియ నాయక్ అన్నారు. బుధవారం కామేపల్లి మండలం లింగాలలో ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఎలాంటి వర్గ విభేదాలు లేకుండా కలిసికట్టుగా పనిచేసి అత్యధిక స్థానాల్లో గెలుపొందేలా చూడాలని పార్టీ నేతలకు హరిప్రియ నాయక్ సూచించారు.
NLG: స్థానిక సంస్థల ఎన్నికల్లో నిరంతరం ప్రజల కోసం పని చేస్తున్న సీపీఎం అభ్యర్థులను గెలిపించాలని ఆ పార్టీ జిల్లా కమిటీ సభ్యులు జిట్ట నగేష్, అవిశెట్టి శంకరయ్యలు విజ్ఞప్తి చేశారు. చిట్యాల మండలం పిట్టంపల్లిలో బుధవారం జరిగిన పార్టీ గ్రామ శాఖ సమావేశంలో పాల్గొని మాట్లాడారు. పిట్టంపల్లి గ్రామ అభివృద్ధికి తమ పార్టీ శాయశక్తులా కృషి చేసిందని తెలిపారు.
SRCL: స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో హెల్ప్ లైన్, ఫిర్యాదుల కేంద్రం బుధవారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆ కేంద్రాన్ని అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ ప్రారంభించారు. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో హెల్ప్ లైన్, ఫిర్యాదుల కేంద్రం ఏర్పాటు చేశామని తెలిపారు.
KMM: ఎన్నికల హామీల అమలులో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వైరా నియోజకవర్గ BRS పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు తెలిపారు. బుధవారం ఏన్కూరు మండల కేంద్రంలో మండల BRS పార్టీ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ తరఫున ఎవరిని నియమించిన వారి గెలుపు కోసం పార్టీ శ్రేణులు కృషి చేయాలని ఆయన పేర్కొన్నారు.
కామారెడ్డి పట్టణంలోని సబ్ స్టేషన్‌లో బుధవారం ఆయుధ పూజా చేశారు. విద్యుత్ శాఖ ఏడీఈ కిరణ్ చైతన్య మాట్లాడుతూ.. విజయదశమి పర్వదినాన్ని ప్రతి ఒక్కరూ ఆనందోత్సవాల మధ్య జరుపుకోవాలని సూచించారు. దుర్గమ్మ తల్లి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ అధికారులు పాల్గొన్నారు.
మేడ్చల్: మల్కాజ్‌గిరి రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలలో 15 సంవత్సరాల వయసు కలిగిన బాలికను రైల్వే ప్రొటెక్షన్ పోలీసుల బృందం రక్షించినట్లుగా బుధవారం తెలియజేసింది. కొన్ని ముఠాలు వెట్టిచాకిరి కోసం బాలికలను తరలిస్తున్నట్లుగా గుర్తించి, స్పెషల్ ఆపరేషన్ నిర్వహించి, చేదించినట్లుగా తెలిపారు. దొరికిన ముఠా సభ్యులపై వివిధ కేసులు నమోదు చేశారు.
BHNG: విజయవాడ కనకదుర్గమ్మను బుధవారం ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలతో పాటు, ఆలేరు నియోజకవర్గ ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు తెలిపారు.
కామారెడ్డి మండలం గర్గుల్ గ్రామంలో దసరా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించే దసరా ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తయినట్లు ఛైర్మన్ చింతల రవితేజ గౌడ్, అధ్యక్షులు గోవర్ధన్ తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా కళాకారులచే ఆటపాట కార్యక్రమాలు, రంగురంగుల టపాసుల ప్రదర్శన, అనంతరం రావణ దహనం కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.
SRCL: స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో జిల్లాలో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి ఎం. హరిత కోరారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ పై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో కలెక్టర్ బుధవారం సమావేశం నిర్వహించారు.