• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

సికింద్రాబాద్‌లో మొబైల్ దొంగ అరెస్ట్..!

HYD: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిధిలో ఓ మొబైల్ దొంగతనం చేసిన వ్యక్తిని రైల్వే ప్రొటెక్షన్ పోలీసులు అరెస్టు చేసినట్లు బుధవారం తెలిపారు. అతని నుంచి ఒక మొబైల్ ఫోన్, రూ.7,000 విలువచేసే పర్సు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అతనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, చట్టం పరంగా తగిన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు.

October 1, 2025 / 04:12 PM IST

నిరుపేదలకు వస్త్రాల పంపిణీ

KMR: బీర్కూర్‌కు చెందిన మున్నూరు కాపు సంఘ ఉద్యోగులు దసరా పండగ పురస్కరించుకొని పలువురు నిరుపేదలకు పోచమ్మ గుడి వద్ద బుధవారం నూతన వస్త్రాలను పంపిణీ చేశారు. మున్నూరు మున్నూరు కాపు ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కంఠం అంబయ్య మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ సేవ గుణాన్ని అలవర్చుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్, విఠల్, మేకల విట్టల్, కంఠం శ్రీనివాస్ ఉన్నారు

October 1, 2025 / 04:08 PM IST

జఫర్గడ్ ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన రామారావు

JN: జఫర్గడ్ ఎస్సైగా రామారావు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో వీరు వర్ధన్నపేట సుబేదారి స్టేషన్ నందు పని చేశారు. బదిలీపై జఫర్గడ్ స్టేషన్‌కు వచ్చారు. ఈ సందర్భంగా స్టేషన్ సిబ్బంది వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా విధినిర్వహణలో అంకితభావంతో పనిచేసి శాంతి భద్రతలను పరిరక్షిస్తానని వారు తెలిపారు. ప్రజలు అందరూ సహకరించాలని కోరారు.

October 1, 2025 / 04:07 PM IST

కష్టపడి చదివితే.. ఫలితం -ఎస్పీ

MDK: కష్టపడితే ఫలితం వస్తుందనడానికి నిదర్శనం డీఎస్పీ పోస్టులని జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు పేర్కొన్నారు. మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయంలో గ్రూప్-1 డీఎస్పీ ఉద్యోగం సాధించిన శైలేష్, ప్రభాత్ రెడ్డి, ప్రణయ్ సాయిలను జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. కష్టపడి చదివి డీఎస్పీ ఉద్యోగం సాధించిన ముగ్గురినీ అభినందించారు.

October 1, 2025 / 04:03 PM IST

జిల్లా పౌర సంబంధాల అధికారిగా లక్ష్మణ్ కుమార్

SRCL: జిల్లా ఇంఛార్జ్ పౌర సంబంధాల అధికారిగా (కరీంనగర్ ఏడీ) లక్ష్మణ్ కుమార్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ముందుగా జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో కలెక్టర్ హరితను మర్యాద పూర్వకంగా కలిసి, పుష్పగుచ్చం అందజేశారు. జర్నలిస్టులకు అందుబాటులో ఉంటూ సేవలు అందించాలని సూచించారు. ఐ అండ్ పీఆర్ కమిషనర్ ఆదేశాల మేరకు జిల్లా ఇంఛార్జ్ డీపీఆర్‌వోగా నియమించారు.

October 1, 2025 / 04:03 PM IST

‘కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కార్యకర్తలు కృషి చేయాలి’

BDK: ములకలపల్లి రాయల్ ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజాప్రతినిధులు అనుబంధ సంఘ నాయకులు బుధవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ..జరగనున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ, గ్రామపంచాయతీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఎమ్మెల్యే ఆదినారాకయణ పేర్కొన్నారు.

October 1, 2025 / 04:02 PM IST

జిల్లాలో 30, 30ఎ పోలీసు యాక్ట్ అమలు

KMR: జిల్లాలో శాంతిభద్రతల దృష్ట్యా అక్టోబర్ 1 నుంచి 31 వరకు 30, 30ఏ పోలీసు యాక్ట్ 1861 అమలులో ఉంటుందని SP రాజేష్ చంద్ర బుధవారం తెలిపారు. పోలీసుల ముందస్తు అనుమతి లేకుండా ధర్నాలు, రాస్తా రోకోలు, ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్‌లు, సభలు నిర్వహించరాదని, ప్రజాధనాన్ని నష్టపరిచే కార్యక్రమాలు చేపట్టరాదని ఎస్పీ హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయన్నారు.

October 1, 2025 / 04:01 PM IST

‘ఎన్నికల విధులను పకడ్బందీగా నిర్వహించాలి’

KMM: ఎన్నికల విధులను పకడ్బందీగా నిర్వహించాలని మాస్టర్ ట్రైనర్ జిల్లా ఉపాధి కల్పన అధికారి శ్రీరామ్ అన్నారు. బుధవారం డిపిఆర్సి భవనంలో నోడల్ అధికారులు, రిటర్నింగ్ అధికారులకు, మాస్టర్ ట్రైనర్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రతి ఒక్కరు తమకు కేటాయించిన హ్యండ్ బుక్ ఒకటికి రెండుసార్లు పరిశీలించాలని, ముఖ్యమైన నిబంధనలు మార్క్ చేసి పెట్టుకోవాలని ఆయన సూచించారు.

October 1, 2025 / 04:00 PM IST

‘కోర్టు తీర్పు వచ్చే వరకు వేచి చూడాలి’

KMR: అక్టోబర్ 8న స్థానిక సంస్థల ఎన్నికలపై కోర్టు తీర్పు వెలువడే వరకు వేచి చూడాలని ధర్మసమాజ్ పార్టీ జిల్లా నాయకులు పార్టీ శ్రేణులకు సూచించారు. బుధవారం పార్టీ ఆఫీసులో అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం కోర్టు తీర్పు రాకముందే ఎన్నికల విషయంలో ప్రజలను అయోమయ స్థితిలో నెట్టి, గందరగోళానికి గురి చేయడం సరికాదన్నారు.

October 1, 2025 / 03:57 PM IST

‘లంబాడీలపై ప్రభుత్వం వివక్ష చూపిస్తుంది’

RR: నందిగామ మండలంలో 9 ఎంపీటీసీ స్థానాలు ఉండగా, ఒక్క స్థానం కూడా ఎస్టీలకు రిజర్వ్ చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం లంబాడీలను మోసం చేసిందని LHPS నాయకులు శ్రీనివాస్ అన్నారు. మండలంలోని నందిగామ, రంగాపూర్, మేకగూడ, చేగూరు గ్రామాల్లో 9 గిరిజన తండాలు ఉన్నాయని, కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క ఎంపీటీసీ రిజర్వు చేయకుండా తీవ్ర వివక్ష చూపిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.

October 1, 2025 / 03:57 PM IST

విద్యార్థిని ప్రాజెక్ట్ ఫైల్‌ను పరిశీలించిన ఎమ్మెల్సీ

NLG: మునుగోడు మండలం పులిపలుపుల గ్రామానికి చెందిన కంభంపాటి హర్షిత అనే తొమ్మిదవ తరగతి విద్యార్థిని తయారు చేసిన స్కూల్ ప్రాజెక్ట్ ఫైల్‌ను శాసనమండలి సభ్యులు నెల్లికంటి సత్యం బుధవారం పరిశీలించి అభినందించారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని శ్రీ చైతన్య స్కూల్లో హర్షిత చదువుతోంది. ఈ కార్యక్రమంలో సీపీఎం మండల కార్యవర్గ సభ్యులు ఈదులకంటి కైలాసం, పరమేష్ తదితరులు పాల్గొన్నారు.

October 1, 2025 / 03:56 PM IST

హోంగార్డు కుటుంబానికి బీమా చెక్కు అందజేత: CP

KMM: గతేడాది మాదారం నుండి ఖమ్మం విధులకు వెళ్తున్న ఖమ్మం యూనిట్‌కు చెందిన హోంగార్డు చందర్ HG 915‌కు జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. కాగా హోంగార్డు కుటుంబానికి యాక్సెస్ బ్యాంక్ సాలరీ అకౌంట్‌తో వచ్చే ప్రయోజనాలు, ప్రమాద బీమా సొమ్ము రూ. 34 లక్షల చెక్కు మంజూరైంది. బుధవారం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ హోంగార్డు కుటుంబ సభ్యులకు చెక్కును అందజేశారు.

October 1, 2025 / 03:56 PM IST

గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాం లభ్యం

SRD: హత్నూర మండలం గోవిందరాజు పల్లి శివారులో కుంటలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాం లభ్యమైంది. మృతదేహాన్ని చూసిన స్థానికులు వెంటనే హత్నూర పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి పోలీసులు చేరుకొని వ్యక్తి మృతదేహం ఆనవాళ్లను పరిశీలిస్తున్నారు. శవం ఒంటిగంట రక్తపు మరకలు గాయాలు ఉన్నాయి. లభ్యమైన మృతదేహన్ని మార్చురీకి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

October 1, 2025 / 03:55 PM IST

వైభవలక్ష్మి దేవిగా దర్శనమిచ్చిన అమ్మవారు

WGL: రాయపర్తి మండలం వెంకటేశ్వరపల్లిలోని స్వయం వ్యక్త శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో బుధవారం శ్రీ మహాలక్ష్మి అమ్మవారు వైభవలక్ష్మి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ అనువంశిక ధర్మకర్తలు, ఆలయ అభివృద్ధి కమిటీ, పూజారులు, వికాస తరంగిణి-సన్నూరు సేవా బృందం ఆధ్వర్యంలో శ్రీ మహాలక్ష్మి శరన్నవరాత్రి ఉత్సవాలను నిర్వహిస్తున్నారు.

October 1, 2025 / 03:52 PM IST

‘రేపు మాంసం దుకాణాలు, హోటళ్లు బంద్’

NZB: రేపు గాంధీ జయంతి సందర్భంగా మాంసం దుకాణాలు, హోటళ్లు మూసివేయాలని ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ రాజు సూచించారు. ఆయన మాట్లాడుతూ.. మాంసం దుకాణాలు, హోటళ్ల నిర్వాహకులు నియమ నిబంధనలను పాటించాలన్నారు. పశువులు, గొర్రెలు, మేకలు, కోళ్ల వధ, వాటి మాంసం క్రయవిక్రయాలు పూర్తిగా నిషేధం అన్నారు. నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

October 1, 2025 / 03:50 PM IST