KMR: జిల్లాలో శాంతిభద్రతల దృష్ట్యా అక్టోబర్ 1 నుంచి 31 వరకు 30, 30ఏ పోలీసు యాక్ట్ 1861 అమలులో ఉంటుందని SP రాజేష్ చంద్ర బుధవారం తెలిపారు. పోలీసుల ముందస్తు అనుమతి లేకుండా ధర్నాలు, రాస్తా రోకోలు, ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్లు, సభలు నిర్వహించరాదని, ప్రజాధనాన్ని నష్టపరిచే కార్యక్రమాలు చేపట్టరాదని ఎస్పీ హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయన్నారు.