NZB: రేపు గాంధీ జయంతి సందర్భంగా మాంసం దుకాణాలు, హోటళ్లు మూసివేయాలని ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ రాజు సూచించారు. ఆయన మాట్లాడుతూ.. మాంసం దుకాణాలు, హోటళ్ల నిర్వాహకులు నియమ నిబంధనలను పాటించాలన్నారు. పశువులు, గొర్రెలు, మేకలు, కోళ్ల వధ, వాటి మాంసం క్రయవిక్రయాలు పూర్తిగా నిషేధం అన్నారు. నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.