MDK: షీటీమ్స్ జిల్లాలో అవేర్నెస్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు మెదక్ జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు తెలిపారు. ఒక ప్రకటన విడుదల చేస్తూ.. జిల్లా వ్యాప్తంగా ఈవ్ టీజర్స్ పట్టుకొని 2 FIR లను, 2 E-PETTY కేసులను నమోదు చేశామన్నారు. తూప్రాన్ సబ్ డివిజన్‌లో 27 మందిని, మెదక్ సబ్ డివిజన్‌లో 36 మంది రెడ్ హ్యాండ్‌గా పట్టుకుని కౌన్సెలింగ్ ఇచ్చామన్నారు.
ASF: ఎమ్మెల్యే కోవ లక్ష్మి ఆధ్వర్యంలో బుధవారం నార్నూర్ మండల కాంగ్రెస్ సీనియర్ నాయకుడు చౌహన్ యశ్వంత్ రావుతో పాటు మరికొంత మంది ముఖ్య నేతలు కాంగ్రెస్‌ను వీడి BRSలో చేరారు. మండల నాయకులతో జరిగిన స్థానిక సంస్థల సమీక్షా సమావేశంలో MLA లక్ష్మి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో BRS రాష్ట్ర నాయకురాలు సరస్వతి, కార్యకర్తలు పాల్గొన్నారు.
HYD: సైబర్ నేరాలలో హైదరాబాద్ దేశంలో రెండో అతిపెద్ద నగరంగా నిలిచింది. NCRB డేటా ప్రకారం.. 2023లో 4,855 కేసులు నమోదు కాగా, వాటిలో 59% ఆన్‌లైన్ బ్యాంకింగ్ మోసాలకు సంబంధించినవే. డిజిటల్ లావాదేవీల్లో మోసాలు పెరుగుతున్నాయనే సంకేతంగా పోలీసులు భావిస్తున్నారు. అయితే, సాక్ష్యాల లేమితో సగానికి పైగా కేసులు మూసేయటం, దర్యాప్తు లోపాలపై ఆందోళనలకు దారితీస్తోంది.
SRD: ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం TG యువజన అధ్యక్షుడిగా నియమితులైన సేవాలాల్ నాయక్‌కు హైదరాబాద్ మినిస్టర్ క్వార్టర్స్‌లో జహీరాబాద్ MP సురేష్ షెట్కర్ అభినందించారు. ఈ మేరకు బుధవారం సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సేవాలాల్ నాయక్ మాట్లాడుతూ.. బంజారాల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని, రాష్ట్ర అధ్యక్షుడిగా తన బాధ్యత పెరిగిందన్నారు.
ADB: ఇచ్చోడ మండల కేంద్రంలోని విద్యానగర్ కాలనీలో నెలకొల్పిన దుర్గామాత మండపాన్ని ఎంపీ గోడం నగేష్ బుధవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉమ్మడి జిల్లా ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం దుర్గా మండలి సభ్యులు ఎంపీని శాలువాతో సత్కరించారు.
WGL: నల్లబెల్లి మండలంలో వీధి కుక్కలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. మండల పరిధిలోని బోలోని పల్లె గ్రామంలో బుధవారం చిన్నారి సంగీత(8)పై కుక్క దాడిచేసింది. ఈ ఘటనలో గాయపడిన చిన్నారిని కుటుంబ సభ్యులు వెంటనే నల్లబెల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డాక్టర్ ఆచార్య ఆమెకు తగిన చికిత్స అందించారు. చిన్నారి ఆరోగ్యం స్థిరంగా ఉందని డాక్టర్ తెలిపారు.
KMM: నిర్ణీత లక్ష్యం మేరకు రైస్ డెలివరీ పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి అన్నారు. బుధవారం అదనపు కలెక్టర్, కలెక్టరేట్ లో పెండింగ్ రా రైస్ డెలివరీపై రైస్ మిల్లర్లతో సమావేశం నిర్వహించారు. జిల్లా నుంచి గత ఖరీఫ్ సీజన్‌లో పెండింగ్ ఉన్న 11 వేల 500 మెట్రిక్ టన్నులు రా రైస్, బాయిల్డ్ రైస్ 3500 మెట్రిక్ టన్నులు FCIకు సరఫరా చేయాలని ఆయన తెలిపారు.
JN: పాలకుర్తి మండలం విస్నూర్ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ నేతలు బుధవారం విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. పాలకుర్తి మాజీ జడ్పీటీసీ పుస్కూరి శ్రీనివాస్ రావు హాజరై మాట్లాడుతూ.. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని చిత్తుచిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వ మోసపూరితమైన 420 హామీలు ఇచ్చింది అన్నారు.
మేడ్చల్: శామీర్‌పేట్ PS పరిధిలోని లింగాపూర్ తండా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అదుపుతప్పి పల్టీ కొట్టడంతో అద్రాస్ పల్లి వాసి తనూశ్ మృతి చెందాడు. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రుడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
SRCL: విజయదశమి సందర్భంగా అందరికి విజయాలు చేకూర్చాలని సిరిసిల్ల ఎస్పీ గీతే అన్నారు. విజయదశమి సందర్భంగా సిరిసిల్లలోని ఎస్పీ కార్యాలయంలో పోలీసులు బుధవారం ఆయుధ పూజ నిర్వహించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. ఈ విజయదశమి ప్రజలందరికీ విజయాలు చేకూర్చే విధంగా జరగాలని కోరుకుంటున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఏఎస్పీ చంద్రయ్య, డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.
MHBD: మహబూబాబాద్ జిల్లా పరిధిలోని దంతాలపల్లి, పెద్ద ముప్పారం, ఈదుల పూసపల్లి సహా అనేక ప్రాంతాలలో చిరుజల్లులతో కూడిన వర్షం కురిసింది. రెండు రోజుల అనంతరం తిరిగి వర్షం కురవడంతో వాతావరణ చల్లబడింది. కాగా, నేడు రాత్రి నుంచి రేపటి వరకు మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు TGDPS అధికారులు తెలిపారు.
NLG: విజయ దశమి (దసరా) పర్వదినాన్ని పురస్కరించుకొని బుధవారం నేరేడుగొమ్ము మండలం పెద్దమునిగల్‌లో శ్రీ తుల్జా భవాని మాత ఆలయాన్ని ఎమ్మెల్యే బాలునాయక్ సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తల్లి ఆశీస్సులు ఎల్లప్పుడూ నియోజక వర్గ ప్రాంత ప్రజలపై ఉండి ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో పాడిపంటలతో సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. ఇందులో స్థానిక నాయకులు పాల్గొన్నారు.
SRD: కంగ్టి మండల పంచాయతీ నూతన అధికారి (ఎంపీవో)గా లక్ష్మణ్ నియమితులయ్యారు. ఈ మేరకు బుధవారం పదివి బాధ్యతలు స్వీకరించారు. స్థానిక ఎంపీడీవో సత్తయ్య, పంచాయతీ కార్యదర్శులు ఆయనకు స్వాగతించి శాలువా కప్పి సత్కరించారు. ఝరాసంగం మండలంలో పనిచేసిన ఈయన కంగ్టికి బదిలీపై వచ్చారు. ఇంతకాలం MPOగా కంగ్టి కార్యదర్శి సుభాష్ ఇంఛార్జ్‌గా విధులు నిర్వహించారు.
WGL: గాంధీ జయంతి సందర్భంగా గురువారం అన్ని వైన్ షాపులు బంద్ కానున్నాయి. రేపు దసరా కావడంతో ముక్క చుక్క లేనిదే ముద్ది దిగదని పలువురు అంటున్నారు. ఈ నేపథ్యంలో నల్లబెల్లి మండలంలో నేడు మద్యం షాప్‌ల ముందు జనాలు క్యూలైన్ కట్టారు. ఈ సందర్భంగా వైన్ షాపులు మూసి, రహస్యంగా విక్రయాలు జరగకుండా పర్యవేక్షణ కొనసాగిస్తున్నామని స్థానిక అధికారులు తెలిపారు.
WGL: నల్లబెల్లి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు నన్నేసాహెబ్ తల్లి ఇటీవల మృతి చెందింది. ఈ సందర్భంగా వారి కుటుంబాన్ని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి బుధవారం పరామర్శించారు. పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలుపుతూ, ఈ కష్ట సమయంలో కుటుంబానికి మద్దతుగా ఉంటామని తెలిపారు.