• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

నూతన పోలీస్ కమిషనర్ బాధ్యతల స్వీకరణ

SDPT: సిద్దిపేట నూతన పోలీస్ కమిషనర్‌గా S.M. విజయ్ కుమార్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం పోలీస్ అధికారులతో ఇంట్రాక్టివ్ సెషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అందరూ కలిసి జట్టుగా పనిచేయాలన్నారు. ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి మరింత మెరుగైన పోలీస్ సేవలు అందించాలని సూచించారు.

October 6, 2025 / 02:58 PM IST

పీహెచ్‌సీని సందర్శించిన వైద్యాధికారి

KNR: చిగురు మామిడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ పీవో ఎంహెచ్ఎన్ డాక్టర్ సన జవేరియాతో కలిసి తనిఖీ చేశారు. అటెండెన్స్ రిజిస్టర్,అవుట్ పేషెంట్ రిజిస్టరులను ఇతర రికార్డులను వెరిఫై చేశారు. ఎన్ సి డి క్లినిక్ లో అసంక్రమిత వ్యాధుల రికార్డులను పరిశీలించి అందులో అధిక రక్తపోటు,షుగర్ వ్యాధి గ్రస్తుల వివరాలు తీసుకున్నారు.

October 6, 2025 / 02:54 PM IST

సమిష్టి కృషితోనే గెలుపు సాధ్యం: MLA

ADB: సమిష్టి కృషితోనే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయమని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని న్యూ హౌసింగ్ బోర్డ్ బీజేపీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన సమావేశంలో MP నగేశ్ తో సమావేశమై మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను గ్రామస్థాయిలో విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. అభ్యర్థుల గెలుపునకు ప్రతి ఒక్కరు పనిచేయాలని కోరారు.

October 6, 2025 / 02:47 PM IST

సొయా పంటలను పరిశీలించిన ఎమ్మెల్యే

NRML: ముధోల్ మండలంలో రాత్రి కురిసిన అకాల వర్షాల వల్ల వందల ఎకరాల్లో సోయా పంట నష్టపోయింది. ఈ సందర్బంగా రైతులను పరామర్శించిన ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్, ప్రభుత్వం ద్వారా అన్నివిధాలా ఆదుకునేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. వ్యవసాయ అధికారులు నష్టాల అంచనాలు పంపించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, రైతులు పాల్గొన్నారు.

October 6, 2025 / 02:46 PM IST

సింగూర్‌కు మళ్లీ పెరిగిన వరద..2 గేట్లు ఎత్తివేత

SRD: పుల్కల్ మండలం సింగూర్ ప్రాజెక్టుకు సోమవారం మళ్లీ వరద పెరిగింది. ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షానికి 22 వేల క్యూసెక్కుల వరద ప్రాజెక్టులో చేరుతున్నట్లు ఇరిగేషన్ DEE నాగరాజ్ తెలిపారు. వరద ప్రవాహం దృష్ట్యా ప్రాజెక్టు 2 గేట్లు ఎత్తి 28,768 క్యూసెక్కులు దిగువకు వదిలినట్లు చెప్పారు. మంజీర నది పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.

October 6, 2025 / 02:46 PM IST

‘PM మోదీ సంక్షేమ పథకాల వల్లే గ్రామాలు అభివృద్ధి’

MNCL: కన్నెపల్లి మండల కేంద్రంలో BJP మండల అధ్యక్షుడు ఆశన్న అధ్యక్షతన సోమవారం మండల కార్యవర్గ సమావేశం నిర్వహించారు. జిల్లా కార్యదర్శి మహీధర్ గౌడ్ హాజరై మాట్లాడారు. BRS ప్రభుత్వ వైఫల్యాలు,కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మోసం చేస్తున్న తీరును ప్రజలకు వివరించాలన్నారు. ప్రధాని మోదీ సంక్షేమ పథకాల వల్లే గ్రామాలు అభివృద్ధి చెందాయన్నారు.

October 6, 2025 / 02:43 PM IST

ముగిసిన జిల్లా స్థాయి బాక్సింగ్ ఎంపిక పోటీలు

NRML: నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో సోమవారం అండర్ 14 బాక్సింగ్ క్రీడాకారుల ఎంపిక పోటీలను నిర్వహించారు. పిడి సత్తయ్య, బాక్సింగ్ కోచ్ చందు స్వామి లు మాట్లాడుతూ.. బాక్సింగ్ ఎంపిక పోటీలు విజయవంతంగా ముగిసాయని త్వరలో జరిగే జోనల్ స్థాయి పోటీలలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జట్టు ఎంపిక కొరకు ఈ పోటీలు నిర్వహించడం జరిగిందని తెలిపారు.

October 6, 2025 / 02:38 PM IST

రేపు రాచాలలో వాల్మీకి విగ్రహ ప్రతిష్ఠ

MBNR: అడ్డాకుల మండలం రాచాల గ్రామంలో మంగళవారం వాల్మీకి మహర్షి జయంతి సందర్భంగా విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం ఘనంగా నిర్వహించనున్నారు. గ్రామంలో ఇటీవల నిర్మించిన నూతన ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠకు ఏర్పాట్లు పూర్తి చేశామని వాల్మీకి సంఘం ఉపాధ్యక్షుడు పసుల జానకి రాం తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువత, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొననున్నారు.

October 6, 2025 / 02:38 PM IST

న్యూ ఇండియా పార్టీకి షోకాజ్ నోటీస్ జారీ: కలెక్టర్

PDPL: న్యూ ఇండియా పార్టీకి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి షోకాజ్ నోటీసు జారీ చేశారు.భారత రాజ్యాంగం ప్రకారం రిజిస్టర్డ్ పార్టీలు తప్పనిసరిగా నియామక ఆడిట్ అకౌంట్స్ సమర్పించాలి. అయితే, న్యూఇండియా పార్టీ 2021-22, 2022-23, 2023-24 సంవత్సరాలకు సంబంధించిన ఆడిట్ అకౌంట్స్ వివరాలను సమర్పించడంలో విఫలమైంది. ప్రజా ప్రతినిధి చట్టం 1951, సెక్షన్ 29-ఎ ప్రకారం ఈ చర్య తీసుకున్నామని తెలిపారు.

October 6, 2025 / 02:33 PM IST

‘వైద్య సీట్లు పొందిన గురుకుల విద్యార్థులు

SRD: జహీరాబాద్ నియోజకవర్గం భూచనల్లి తెలంగాణ ప్రభుత్వ మైనారిటీ గురుకులం నుండి 8 మంది, అల్గోల్ మైనారిటీ గురుకులం నుండి 7 మంది విద్యార్థులు ఎంబీబీఎస్ సీట్లు సాధించడం పట్ల మాజీ మంత్రి హరీష్ రావు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎంబీబీఎస్ సీటు సాధించిన విద్యార్థిని ఫిర్దోస్ హరీష్ రావును కలవగా ఆయన అభినందించారు. కష్టపడి చదవాలని హరీష్ రావు సూచించారు.

October 6, 2025 / 02:31 PM IST

90వ సంవత్సరంలో అడుగుపెట్టిన దేవరకొండ ఆర్టీసీ డిపో

NLG: దేవరకొండ ఆర్టీసీ డిపో 89 సంవత్సరాలు పూర్తి చేసుకుని సోమవారం 90వ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా డిపో మేనేజర్ తల్లాడ రమేష్ బాబు ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. డిపో 1936 అక్టోబర్ 6న నిజాం స్టేట్ సర్కార్ ఉన్నప్పుడు ఏర్పడిన రెండవ డిపో అని గుర్తు చేశారు. చరిత్రకారుడు యూనూస్ ఫర్హాన్ అప్పటి ఫోటోలు సేకరించి డిపో అధికారుల సమక్షంలో ప్రదర్శించారు.

October 6, 2025 / 02:29 PM IST

కుర్షీద్ హోటల్ యజమానితో సహా పలువురుపై కేసు నమోదు

WGL: జిల్లా మండిబజారులోని కుర్షీద్ హోటల్ యజమానిపై మట్టెవాడ పోలీసులు కేసు నమోదు చేశారు. CI కరుణాకర్ వివరాల ప్రకారం.. ఆదివారం ఉదయం రణవీర్, అతని సోదరుడు సూర్య హోటల్‌కు వెళ్లారు. అక్కడ గొడవ జరగగా, HNKకు చెందిన నితీశ్, తరుణ్, చందులు వారిపై దాడి చేశారు. WGL సిటీ యాక్ట్ ఉల్లంఘన నేపథ్యంలో హోటల్ యజమానితోపాటు దాడి చేసిన వారిపై కేసు నమోదు చేసినట్లు CI తెలిపారు.

October 6, 2025 / 02:28 PM IST

సినీ డైరెక్టర్ ని కలిసిన సైన్స్ అండ్ ఆర్ట్స్ స్కూల్ విద్యార్థులు

JGL: మెట్ పల్లి మండలం మేడిపల్లికి వచ్చిన సినీ డైరెక్టర్ వేణు శ్రీరాము గురుకుల ఫైన్ ఆర్ట్స్ స్కూల్ మల్కాజిరి విద్యార్థులు పేరెంట్స్ కమిటీ సభ్యుడు సురేందర్ ఆధ్వర్యంలో కలిశారు. ఇక్కడి విద్యార్థులు లలిత కళలు నేర్చుకొని పలు సినిమాలలో వివిధ విభాగాలలో పనిచేశారని సినిమాలలో అవకాశాలు కల్పించాలని వారు డైరెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు.

October 6, 2025 / 02:27 PM IST

శబరి స్మృతి యాత్ర నిర్వహణకు సర్వం సిద్ధం: ఈవో

BDK: శబరి స్మృతి యాత్రకు తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి సుమారు 5 వేల మంది గిరిజన భక్తులను తీసుకురావడానికి సోమవారం బస్సులను పంపినట్లు భద్రాచలం రామయ్య ఆలయ ఈఓ దామోదర్ తెలిపారు. శబరి స్మృతి యాత్ర నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఈవో పేర్కొన్నారు. యాత్ర సజావుగా జరిగేందుకు ఆలయ సిబ్బంది బస్సుల్లో వెళ్లినట్లు ఆయన తెలిపారు.

October 6, 2025 / 02:27 PM IST

కాంగ్రెస్ బాకీ కార్డుపై బీఆర్‌ఎస్ కీలక సమావేశం

మేడ్చల్: జిల్లా బీఆర్‌ఎస్ కార్యాలయంలో కాంగ్రెస్ బాకీ కార్డు ఉద్యమంపై కీలక సమావేశం ఘనంగా జరిగింది. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన నయవంచక హామీలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ ఉద్యమాన్ని జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా నిర్వహించాలని నిర్ణయించారు. జిల్లా అధ్యక్షుడు, MLC శంబీపూర్ రాజు, MLA మల్లారెడ్డి పాల్గొన్నారు.

October 6, 2025 / 02:25 PM IST