మేడ్చల్: జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో కాంగ్రెస్ బాకీ కార్డు ఉద్యమంపై కీలక సమావేశం ఘనంగా జరిగింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన నయవంచక హామీలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ ఉద్యమాన్ని జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా నిర్వహించాలని నిర్ణయించారు. జిల్లా అధ్యక్షుడు, MLC శంబీపూర్ రాజు, MLA మల్లారెడ్డి పాల్గొన్నారు.