నాగర్‌కర్నూల్ లోక్‌సభ సభ్యుడు మల్లు రవికి బుధవారం ఢిల్లీలో మరో కీలక బాధ్యత దక్కింది. ఆయనను పరిశ్రమల వ్యవహారాల పరిశీలన కమిటీ సభ్యుడిగా లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా నియమించారు. కేంద్ర ప్రభుత్వ వివిధ శాఖల వ్యవహారాలను పర్య వేక్షించే పార్లమెంటరీ స్థాయి సంఘాలను పునర్వ్యవస్థీకరిస్తూ స్పీకర్ ఈ ఉత్తర్వులు జారీ చేశారు.
BHNG: ఇటీవల విడుదల చేసిన గ్రూపు-2 ఫలితాలలో భువనగిరి మండలం పెంచికల్ పహాడ్‌కు చెందిన కీ.శే.బాల్ద రాజయ్య లక్ష్మిల కూతురు అనుష రాష్ట్ర సెక్రటేరియట్‌లో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్‌గా ఎంపిక కావడంతో.. గ్రామస్తులు అనుషను బుధవారం ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ విజయం ద్వారా గ్రామానికీ మంచి పేరు తెచ్చిందని ప్రశంసించారు.
KMR: దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మద్నూర్‌లో నిర్వహిస్తున్న ఉత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి ముస్లిం దంపతులు అమ్మవారికి పూజలు చేసి మతసామరస్యాన్ని చాటుకున్నారు. వారు మాట్లాడుతూ.. దుర్గాదేవి ఆశీస్సులతో ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని వేడుకున్నట్లు చెప్పారు. దుర్గామాత మండప నిర్వాహకులు వారికి అమ్మవారి మెమెంటోను బహుకరించి సత్కరించారు.
WGL: యూరియా బస్తాల కోసం క్యూలో నిలబడితే కాలు విరిగి తీవ్ర ఇబ్బందులు పడుతున్నానని పర్వతగిరి మండలం పెద్దతండాకు చెందిన లూనావత్ కవిత వాపోయారు. కల్లెడలోని సొసైటీ వద్ద యూరియా కూపన్ల కోసం లైన్‌లో నిలబడగా, జనం ఒక్కసారిగా తోసుకురావడంతో కిందపడి కాలు విరిగిందని చెప్పారు. దినసరి కూలీ అయిన తన కుటుంబానికి ఆసరా లేకపోవడంతో ప్రభుత్వం సహాయం అందించాలని వేడుకుంటున్నారు.
KNR: రాష్ట్ర మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, కేంద్ర మంత్రి బండి సంజయ్ కలిసి కరీంనగర్‌లోని శ్రీ మహాశక్తి ఆలయాన్ని బుధవారం రాత్రి దర్శించుకున్నారు. భవానీ మాల దీక్ష విరమణ అనంతరం అమ్మవారి దర్శనానికి మంత్రి శ్రీధర్ బాబును బండి సంజయ్ ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీర్వచనం తీసుకున్నారు.
WNP: జి0ల్లా ప్రజలందరికీ విజయదశమి సందర్భంగా విజయం వరించాలని జిల్లా ఎస్పీ గిరిధర్ ఆకాంక్షించారు. దుష్ట శక్తులపై విజయానికి సంకేతముగా జరుపుకునే దసరా పండుగను స్ఫూర్తిగా తీసుకొని ప్రజలందరు ఐక్యత, సమగ్రతల కోసం కృషి చేయాలన్నారు. ప్రశాంత వాతావరణంలో పండుగను జరుపుకోవాలని సూచించారు.
MNCL: వన్యప్రాణుల వేట కోసం గుర్తుతెలియని వ్యక్తులు ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలను చెన్నూరు అటవీ శాఖ సిబ్బంది తొలగించారు. ఉతుకులపల్లి, కొత్తపల్లి అటవీ ప్రాంతాలలో కొందరు వేటగాళ్లు కరెంటు తీగలను అమర్చారని సమాచారం అందింది. రాత్రి సమయంలో సిబ్బంది వెళ్లి ఎంతో సాహసంతో వాటిని తొలగించారని అటవీ డివిజన్ అధికారి సర్వేశ్వర్ తెలిపారు.
HYD: అంబర్ పేటలోని బతుకమ్మ కుంట నిర్వహణ బాధ్యతను హైడ్రా తీసుకోవాలని వీ. హనుమంతరావు అన్నారు. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌ని కలిసి వినతి పత్రం అందజేశారు. అనంతరం మాట్లాడుతూ.. బతుకమ్మ కుంటను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడంతో ప్రాంత రూపురేఖలు మారిపోయాయన్నారు. బతుకమ్మ కుంట ఇప్పుడు పర్యాటక ప్రాంతంగా మారిందని, దాని పరిరక్షణ బాధ్యతను హైడ్రా తీసుకోవాలన్నారు.
MNCL: స్థానిక ఎన్నికల నిర్వహణలో భాగంగా మంచిర్యాల జిల్లా కార్యాలయంలో హెల్ప్ లైన్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ కుమార్ దీపక్ ప్రకటనలో తెలిపారు. నామినేషన్ల దాఖలు, పరిశీలన, ఉపసంహరణ, పోలింగ్ కేంద్రాలు, పోలింగ్, పోస్టల్ బ్యాలెట్ తదితర సమాచారం, ఫిర్యాదులు కోసం ఈ హెల్ప్ లైన్ ఉపయోగపడుతుందని ఆయన అన్నారు. దీనికోసం 08736-250501 నంబర్‌లో సంప్రదించాలాన్నారు.
ADB: జిల్లా ప్రజలకు కలెక్టర్ రాజర్షి షా విజయదశమి దసరా పండుగ శుభాకాంక్షలు గురువారం తెలియజేశారు. తెలంగాణ సాంస్కృతిక జీవన విధానంలో దసరాకు ప్రత్యేక స్థానం ఉందన్నారు. చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా దసరా పండుగను విజయదశమి పేరుతో దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నారని పేర్కొన్నారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
NLG: నాగార్జునసాగర్ జలాశయానికి ఎగువ నుంచి వరద తక్కువ మొఖం పట్టింది. ఎగువ నుంచి 4,14,188 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది. అయితే నీటిని సాగర్ జలాశయం నుంచి బుధవారం రాత్రి 24 గేట్ల ద్వారా 3,61,322 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు.
NZB: CITU ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం నూతన భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నూతన కార్యవర్గం ఎన్నుకున్నారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ.. జిల్లా అధ్యక్షునిగా ఎన్నికైన కృష్ణ, ప్రధాన కార్యదర్శిగా శంకర్ గౌడ్‌ను నియమించినట్లు చెప్పారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం కృషి చేయాలన్నారు.
MBNR: విజయదశమి వేడుకలను పురస్కరించుకొని గురువారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వగ్రామమైన నాగర్ కర్నూల్ జిల్లా కొండారెడ్డిపల్లెకు వెళ్లనున్నారు. CM నివాసం వద్ద భద్రతాపరమైన ఇబ్బందులు తలెత్తకుండా బారికేడ్లు, మెటల్ డిటెక్టర్ ఏర్పాటు చేస్తున్నారు. కొడంగల్ పట్టణాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్న పోలీసులు ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా నిఘా పెంచారు.
PDPL: గోదావరిఖని జవహార్ లాల్ నెహ్రూ స్టేడియంలో చేపట్టే దసరా పండుగ ఉత్సవాలను తాత్కలికంగా వాయిదా వేసినట్లు సింగరేణి ఆర్జీ 1 యాజమాన్యం ఓ ప్రకటనలో పేర్కొంది. వారం రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలను దృష్టిలో ఉంచుకుని వాతావరణ పరిస్థితులను పరిశీలించి తాత్కలికంగా వాయిదా వేసేందుకు నిర్ణయించినట్లు తెలిపింది.
PDPL: భవిష్యత్ బీఆర్ఎస్ పార్టీ దేనని పార్టీ రాష్ట్ర నాయకుడు వ్యాళ్ల హరీశ్ రెడ్డి అన్నారు. రామగుండం కార్పొరేషన్ 25వ డివిజన్ మాజీ కార్పొరేటర్ నగునూరి సుమలత రాజును ఆయన కలిశారు. BRS బలోపేతం గురించి కాసేపు పార్టీ నేతలతో చర్చించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.