KMM: గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువకులకు స్టేట్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఉచిత శిక్షణ ఇస్తుంది. అసిస్టెంట్ బుక్ కీపర్, ఫోటో, వీడియోగ్రఫీ, ఏసీ మెకానిక్ కోర్సులకు శిక్షణ అందజేస్తుంది. ఉమ్మడి ఖమ్మంలోని ఆసక్తి గల అభ్యర్థులు ఖమ్మం తరుణి హాట్‌లో 9వ తేదీలోపు అప్లై చేసుకోవాలని డైరెక్టర్ శనివారం కోరారు.
BDK: సమితి సింగారం ఎంపీటీసీ అభ్యర్థిగా జనరల్ సీటులో సీనియర్ మహిళా నాయకురాలు కూరపాటి సౌజన్యకు అవకాశం ఇవ్వాల్సిందిగా పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లును శనివారం కోరారు. దీనికి కాంగ్రెస్ నాయకులు మరియు బీసీ నాయకులు మద్దతుగా కలిసి ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేశారు.
ADB: సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం రద్దు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ రాజర్షి షా శనివారం తెలిపారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు 2025, ఉప సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, వార్డు సభ్యుల ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున కార్యక్రమం రద్దు చేయడం జరిగిందని వెల్లడించారు. ఈ విషయాన్ని జిల్లా ప్రజలు గమనించాలని కోరారు.
SRPT: విద్యుత్ మోటార్లను దొంగిలిస్తున ఇద్దరు నిందితులను హుజూర్ నగర్ పోలీసులు శనివారం సాయంత్రం అరెస్టు చేశారు. సీఐ చరమందరాజు తెలిపిన వివరాల ప్రకారం.. హుజూర్ నగర్ పట్టణంలో వాహనాల తనిఖీ చేస్తుండగా, అనుమానాస్పదంగా కనిపించిన ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో వారు విద్యుత్ మోటార్లను దొంగలించినట్లు ఒప్పుకున్నారని తెలిపారు.
SRPT: చింతలపాలెం మండలంలోని పులిచింతల ప్రాజెక్టుకు వరద నీరు భారీగా వచ్చి చేరుతుంది. ఈ ప్రాజెక్టుకు 1,94,021, క్యూసెక్కుల వరద నీరు వస్తుండగా, శనివారం రాత్రి 4 గేట్ల ద్వారా 16,400 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేసినట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు.
MBNR: దేవి నవరాత్రుల సందర్భంగా తొమ్మిది రోజులపాటు విశేష పూజలు అందుకున్న అమ్మవారి ఊరేగింపు వేడుకలకు మాజీ మున్సిపల్ ఛైర్మన్ ఆనంద్ కుమార్ గౌడ్ శనివారం రాత్రి హాజరయ్యారు. మహబూబ్‌నగర్ పట్టణంలోని ఖలీల్ చౌక్ శేషాద్రి నగర్ తదితర ప్రాంతాలలో జరిగిన ఊరేగింపు వేడుకల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అమ్మవారి ఆశీస్సులు ప్రజలపై ఉండాలన్నారు
JGL: రాయికల్ మండలం మూటపల్లి గ్రామంలో శనివారం రాత్రి బతుకమ్మ పండుగను మహిళలు ఘనంగా అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆడపడుచులు సంప్రదాయ దుస్తులు ధరించి బతుకమ్మ పాటలతో పల్లెలను సందడిగా మారుస్తూ ఆనందోత్సాహాలతో పాల్గొన్నారు. గ్రామంలోని చెరువు వద్ద రంగురంగుల పూలతో అలంకరించిన బతుకమ్మలతో సద్దుల బతుకమ్మ వేడుకలను ఘనంగా జరిపారు.
ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం జోడేఘాట్ లో అక్టోబర్ 7న గిరిజన పోరాటయోధుడు కొమురం భీం వర్ధంతి ఘనంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఆసిఫాబాద్ ASP చిత్తరంజన్ సూచించారు. జోడేఘాట్‌లో వాంకిడి సీఐ సత్యనారాయణ, ఎస్సై మధుకర్ కలిసి ఏర్పాట్లు, పార్కింగ్ స్థలాన్ని పరిశీలించారు.
MNCL: 2వ సాధారణ పంచాయతీ ఎన్నికల MPTC, ZPTC నేపథ్యంలో ప్రతి సోమవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం రద్దు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ప్రకటనలో తెలిపారు. తదుపరి ప్రజావాణి నిర్వహించే సమాచారాన్ని పత్రిక ప్రకటన ద్వారా తెలియజేస్తామన్నారు. అర్జీదారులు, ప్రజలు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.
KNR: ఈ నెల 17 వరకు ఓట్ చోరీపై రాష్ట్ర వ్యాప్తంగా సంతకాల సేకరణ జరుగుతుందని పేర్కొన్నారు. కరీంనగర్ నగరంలోని అన్ని డివిజన్లలో డివిజన్‌కు కనీసం వందకు తగ్గకుండా సంతకాలు చేపడతామని నగర కాంగ్రెస్ అధ్యక్షుడు, సుడా ఛైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి తెలిపారు. చాలా ప్రాంతాల్లో ఓట్ చోరీ జరుగుతుందని మొన్న పాదయాత్రలో టీపీసీసీ అధ్యక్షుడికి ఆధారాలతో చూపించామని అన్నారు.
KMR: రైతులకు ఎరువుల పంపిణీ సక్రమంగా చేపట్టాలని కామారెడ్డి జిల్లా వ్యవసాయ అధికారి మోహన్ రెడ్డి అన్నారు. ఈ మేరకు శనివారం సాయంత్రం గాంధారి మండల కేంద్రంలోని ఉన్నటువంటి సొసైటీ ఫర్టిలైజర్ దుకాణాలలో నిల్వ ఉన్నటువంటి ఎరువుల వివరాలను పంపిణీ వివరాలను పరిశీలించారు. అనంతరం స్టాఫ్ రిజిస్టర్ను కూడా పరిశీలించి తగు సూచనలు సలహాలు తెలియజేశారు.
SDPT: ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున రాజకీయ పార్టీలు సహకరించాలని రాజగోపాల్పేట ఎస్సై వివేక్ తెలిపారు. కోడ్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. శనివారం నంగునూరులో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఎన్నికల్లో నిలిచే అభ్యర్థుల అర్హత, ఖర్చులు, నిబంధనలపై అవగాహన కల్పించారు. ఎంపీడీవో వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.
MDK: జిల్లా సహాయ ఖజానా శాఖ అధికారి (ఏటీఓ)గా సిరికొండ అర్చన బాధ్యతలు చేపట్టారు. నంగునూరుకు చెందిన ఈమె గ్రూప్-1లో 106వ ర్యాంకు సాధించి, సీఎం రేవంత్ రెడ్డి నుంచి నియామక ఉత్తర్వులు అందుకున్నారు. అదనపు కలెక్టర్ నగేష్ను మర్యాదపూర్వకంగా కలిసిన తర్వాత ఆమె విధుల్లో చేరారు. స్వర్ణకార సంఘం అర్చనను ఘనంగా సత్కరించింది.
SRD: ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌తో పాటు నియోజకవర్గ నాయకులు శనివారం హైదరాబాద్‌లో మాజీ మంత్రి హరీష్ రావును మర్యాదపూర్వకంగా కలిశారు. వారికి విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఎన్ఏవో మాజీ అధ్యక్షులు రాజేందర్, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ నరహరి రెడ్డి, మాజీ జడ్పీటీసీ కొండల్ రెడ్డి తదితర ప్రముఖ నాయకులు పాల్గొన్నారు.
SDPT: రేవంత్ రెడ్డి పాలనలో తెలంగాణ తిరోగమనంలో ఉందని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. వైద్యం, విద్య, జీఎస్టీ వృద్ధి, రియల్ ఎస్టేట్ వంటి అనేక రంగాల్లో రాష్ట్రం వెనక్కిపోతోందని ఆయన తీవ్రంగా మండిపడ్డారు. కేసీఆర్ హయాంలో జరిగిన అభివృద్ధి కాంగ్రెస్ పాలనలో నిలిచిపోయిందని ఆరోపించారు. రాష్ట్రంపై ప్రభుత్వానికి దృష్టి లేదని విమర్శించారు.