• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

‘CITU జిల్లా మహాసభలను జయప్రదం చేయండి’

SRD: CITU జిల్లా మహాసభలను19న సదాశివపేట పట్టణంలో జరగనున్నాయని సీఐటీయు నాయకులు కే.రాజయ్య అన్నారు. ఆదివారం పటాన్‌చెరు శ్రామిక భవన్‌లో కిర్బీ పరిశ్రమ కార్మికులతో కీలక సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. సీఐటీయూ ఉన్నపారిశ్రామిక ప్రాంతాలలోనే కార్మికుల సమస్యలు పరిష్కారం అవుతున్నాయని అన్నారు.  వివిధ పరిశ్రమల కార్మికులు సీఐటీయును ఆశ్రయిస్తున్నారని అన్నారు.

October 12, 2025 / 05:33 PM IST

‘నాందేవ్ మహారాజ్ అడుగు జాడల్లో నడవాలి’

NZB: శిరోమణి సద్గురు నాందేవ్ మహారాజ్ అడుగుజాడల్లో నడవాలని ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా తెలిపారు. NZB జిల్లా కేంద్రంలోని వినాయక నగర్‌లో నేడు శిరోమణి సద్గురు నాందేవ్ మహారాజ్ విగ్రహ ప్రతిష్టాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. 700 ఏళ్ల క్రితమే మేరు కులస్తుల ఐక్యత కోసం పోరాడిన మహనీయుడని కొనియాడారు.

October 12, 2025 / 05:31 PM IST

టపాసు దుకాణాలకు అనుమతి తప్పనిసరి: SP

BDK: దీపావళి పండుగ సందర్భంగా కొత్తగూడెం జిల్లా పరిధిలో తాత్కాలిక టపాకాయల దుకాణాలు నెలకొల్పేవారు వారి సంబంధిత డివిజినల్ పోలీస్ అధికారి కార్యాలయం నుండి ధరఖాస్తు చేసుకొని అనుమతి పొండాలని జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. దానికి సంబంధించిన ఇతర సమాచారం కోసం సంబంధిత డివిజినల్ స్థాయి పోలీస్ అధికారులను సంప్రదించాలని తెలిపారు.

October 12, 2025 / 05:31 PM IST

ఘనంగా పాస్టర్స్ డే

WGL: వర్ధన్నపేట మండలం నల్లబెల్లి గ్రామంలోని ఎక్లేసియా పెంతుకోస్తు ప్రార్థన మందిరంలో పాస్టర్ సుమన్ ఆధ్వర్యంలో పాస్టర్స్ డే వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పాస్టర్ సుమన్ దేవుని చిత్తమును నెరవేర్చడానికి దైవజనులు ఎంపికవుతారని పేర్కొన్నారు. యేసు బోధనలు ప్రజలను సన్మార్గంలో నడిపిస్తాయని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో సంఘపెద్దలు, తదితరులు పాల్గొన్నారు.

October 12, 2025 / 05:30 PM IST

శిథిలావస్థకు చేరిన స్మశాన వాటిక

MHBD: గార్ల మండలం పాకాల గ్రామ సమీపంలోని స్మశాన వాటికలో వసతులు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పరిసరాలు అపరిశుభ్రంగా, గదులు శిథిలావస్థలో ఉన్నాయని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. మరమ్మతులు లేక దహన సంస్కారాల సమయంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆగ్రహించారు. అధికారులు తక్షణం స్పందించి మరమ్మతు పనులు చేపట్టాలని ఆదివారం కోరారు.

October 12, 2025 / 05:30 PM IST

ఆదివాసి JAC నూతన కమిటీ ఎన్నిక

BDK: చర్ల మండలం‌లో ఆదివారం ఆదివాసి నాయకులు జేఏసీ నూతన కమిటీని ఎన్నుకున్నారు. జేఏసీ ఛైర్మెన్‌గా కోరం సూర్యనారాయణ‌ను ఎన్నుకోవడం జరిగింది. వైస్ ఛైర్మన్‌గా కారం నరేష్, ట్రెజరర్‌గా శ్యామల రామారావు, ఊయికే బాలకృష్ణ సోషల్ మీడియా ఇన్చార్జిగా కంగాల అభి‌ను ఎన్నుకున్నట్లు తెలిపారు. నాయకులు మాట్లాడుతూ..ఆదివాసి హక్కులకై ఆదివాసి చట్టాల‌కై పోరాడుతామన్నారు.

October 12, 2025 / 05:26 PM IST

ఆరవ రోజు కొనసాగిన సమ్మె

MDK: చేగుంట మండలం వడియారం గ్రామంలోని ఏపీఎల్ అపోలో టైర్స్ కంపెనీలో పనిచేస్తున్న కార్మికులు ఆరవ రోజు ఆదివారం సమ్మె కొనసాగించారు. ముగ్గురు కార్మికులను ఇతర రాష్ట్రాలకు బదిలీ చేయడంతో అక్రమంగా బదిలీ చేశారని 69 మంది కార్మికులు బీఎంఎస్ ఆధ్వర్యంలో సమ్మె నిర్వహిస్తున్నారు. బదిలీ నిలిపే వరకు సమ్మె కొనసాగిస్తామని పేర్కొన్నారు.

October 12, 2025 / 05:23 PM IST

విశ్రాంత ఉద్యోగుల అధ్యక్షునిగా ఉస్మాన్ పాషా

KNR: హుజురాబాద్ పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల అసోసియేషన్ మండల ఎన్నికలు ఆదివారం విశ్రాంత భవన్‌లో జరిగినవి. ఈ ఎన్నికల్లో నూతన అధ్యక్షులుగా యండీ. ఉస్మాన్ పాషా, కార్యదర్శిగా జయవర్థన్, ఆర్థిక కార్యదర్శిగా దుర్గాజీ, సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తదనంతరం నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

October 12, 2025 / 05:23 PM IST

బాధితుడి కుటుంబానికి నష్ట పరిహారం అందజేత

మేడ్చల్: గత రెండు సంవత్సరాల క్రితం జగద్గిరిగుట్ట డివిజన్ రాజీవ్ గృహకల్పలో నివాసముండే నరసింహులు అనే వ్యక్తి విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందాడు. దీంతో ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని సంబంధిత అధికారులను కోరారు. ఈ నేపథ్యంలో విద్యుత్ శాఖ ద్వారా మంజూరైన రూ.5 లక్షల నష్టపరిహార చెక్కును ఆదివారం ఎమ్మెల్యే బాధిత కుటుంబానికి అందజేశారు.

October 12, 2025 / 05:20 PM IST

NSS వాలంటీర్స్‌ను అభినందించిన PU ఉపకులపతి

MBNR: పాలమూరు విశ్వవిద్యాలయం పరీక్ష విభాగం దగ్గర NSS యూనిట్ 1, 5 & 8ల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రత్యేక క్యాంపు 5వ రోజుకు చేరుకుంది. ఈ మేరకు ఉపకులపతి క్యాంపును సందర్శించి మాట్లాడుతూ.. ఈనెల 16న స్నాతకోత్సవం ఉన్నందున యూనివర్సిటీలో శ్రమదానం చేసి క్లీన్ అండ్ గ్రీన్‌గా ఉంచినందుకు వాలంటీర్స్ ప్రోగ్రాం అధికారులను అభినందించారు. కార్యక్రమంలో NSS కోఆర్డినేటర్ పాల్గొన్నారు.

October 12, 2025 / 05:19 PM IST

మోర్తాడ్‌లో మంత్రి పర్యటన

NZB: ఆర్మూర్ పర్యటనకు వెళ్తున్న రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి మార్గమధ్యంలో మోర్తాడ్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ బాల్కొండ ఇన్‌ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ రెడ్డి మంత్రికి స్వాగతం పలికారు. నియోజకవర్గంలో పార్టీ బలోపేతం, స్థానిక సంస్థల ఎన్నికల గురించి చర్చించినట్లు తెలిపారు.

October 12, 2025 / 05:17 PM IST

సీపీఎస్ రద్దు కొరకు కృషి చేస్తా: ఎమ్మెల్యే

JGL: ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు సీపీఎస్ రద్దు చేసి, వోపీఎస్ అమలు కోసం కృషి చేస్తానని ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ తెలిపారు. ఆదివారం జగిత్యాలలోని ఎల్జి గార్డెన్‌లో పీఆర్టీయూ టీఎస్ జగిత్యాల జిల్లా శాఖ సర్వసభ్య సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగుల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామన్నారు.

October 12, 2025 / 05:16 PM IST

‘ఫీడర్ ఛానల్‌కు మరమ్మతులు చేపట్టాలి’

NGKL: కల్వకుర్తి నియోజకవర్గంలోని గట్టు ఇప్పలపల్లిలో ఎర్రగుంట ఫీడర్ ఛానల్ గండిని వెంటనే పూడ్చాలని ఇవాళ బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. మూడేళ్లు గడిచిన అధికారులు స్పందించడం లేదని, దీంతో వర్షపు నీరు వృధాగా పారుతుందని అన్నారు. కల్వకుర్తి ఎమ్మెల్యే స్పందించి సమస్యను పరిష్కరించాలని రైతులను ఆదుకోవాలని వారు కోరారు.

October 12, 2025 / 05:16 PM IST

‘నూతన జాతీయ విద్యా విధానం రద్దుకై ఉద్యమిస్తాం’

KMM: జాతీయ నూతన విద్యా విధానం రద్దుకై విద్యార్థులు ఉద్యమించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి దండి సురేష్ అన్నారు. ఆదివారం ఖమ్మం రూరల్ (మం) ఎదులాపురంలో గర్ల్స్ శాఖ మహాసభ నిర్వహించారు. రాజ్యాంగ స్ఫూర్తికి అంత్యంత ప్రమాదకరం మోడీ అని చెప్పారు. నేడు దేశంలో నూతన విద్యావిధానం పేరుతో యూనివర్శిటీల స్వయం ప్రతిపత్తి దెబ్బ తీసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.

October 12, 2025 / 05:14 PM IST

దీప్తికి శుభాకాంక్షలు ఎమ్మెల్యే

WGL: పర్వతగిరి మండలంలోని కల్లెడ గ్రామానికి చెందిన పారా అథ్లెట్ జీవాంజి దీప్తి, ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌లో జరిగిన వర్చుస్ వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ 2025 ఫైనల్‌లో ఆదివారం గోల్డ్ మెడల్ సాధించింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కె.ఆర్. నాగరాజు ఆమెను, కోచ్‌ను అభినందించి, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని శుభాకాంక్షలు తెలిపారు.

October 12, 2025 / 05:11 PM IST