• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

హుస్నాబాద్‌లో బక్కి వెంకటయ్య పర్యటన

SDPT: రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య సోమవారం హుస్నాబాద్ మండలం జిల్లెలగడ్డ సాంఘిక సంక్షేమ గురుకులాన్ని సందర్శించనున్నారు. ఈ నెల 7న అనుమానాస్పదంగా మరణించిన దళిత విద్యార్థి సానాది వివేక్ మృతి ఘటనపై ఆయన విచారణ చేపట్టనున్నారు. ఈ పర్యటనలో ఎస్సీ, ఎస్టీ సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలని జాతీయ మాల మహానాడు ఇంఛార్జి ఆరె కిషోర్ కోరారు.

October 13, 2025 / 08:21 AM IST

నేడు జిల్లాలో ఏఐసీసీ పరిశీలకుల పర్యటన

NRML: నూతన డీసీసీ అధ్యక్షుల ఎంపిక నేపథ్యంలో ఏఐసీసీ పరిశీలకులు అజయ్ సింగ్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, మిద్దెల జితేందర్ లు నేడు, రేపు నిర్మల్, ఖానాపూర్,ముధోల్ ప్రాంతాల్లో పర్యటిస్తారు. ఈరోజు ఖానాపూర్‌లో కాంగ్రెస్ నాయకులతో సమావేశం జరగనుంది. రేపు నిర్మల్, మామడ, ముధోల్ నియోజకవర్గాల్లో పరిశీలకులు పర్యటిస్తారని డీసీసీ క్యాంప్ అధికారులు సోమవారం ప్రకటనలో తెలిపారు.

October 13, 2025 / 08:20 AM IST

‘హిందుత్వం జీవన విధానం విశ్వశాంతికి ఆధారం’

PDPL: హిందుత్వం జీవన విధానం విశ్వశాంతికి ఆధారమని ఆర్ఎస్ఎస్ పథసంచాలన్ సామల కిరణ్ అన్నారు. ఆర్ఎస్ఎస్ వందేళ్ల ఉత్సవాల్లో భాగంగా కమాన్ పూర్ ఖండ ఆధ్వర్యంలో పథ సంచలన్ నిర్వహించారు. సామల కిరణ్ మాట్లాడుతూ.. వ్యక్తి నిర్మాణం ద్వారానే దేశ నిర్మాణం సాధ్యమన్నారు. సామాజిక సమరసత, పర్యావరణ పరిరక్షణ, పౌర విధులు ప్రతి కుటుంబంలో పాటించాలన్నారు.

October 13, 2025 / 08:16 AM IST

నేడు ప్రజావాణి యధాతథం

నల్గొండ: కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం యథావిధిగా కొనసాగుతుందని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఒక ప్రకటనలో తెలిపారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు దరఖాస్తుదారులు తమ అర్జీలు సమర్పించవచ్చని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని దరఖాస్తుదారులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.

October 13, 2025 / 08:15 AM IST

కిన్నెరసాని ఆరవ గేటు ఎత్తివేత

BDK: పాల్వంచ మండలంలోని కిన్నెరసాని జలాశయం గేట్లు ఆదివారం రాత్రి 406.60 అడుగులకు నీటిమట్టం చేరుకుందని అధికారులు తెలిపారు. దీంతో ఆరవ గేటును ఐదు అడుగుల మేర ఎత్తుకు 500 క్యూసెక్కుల వరద నీరును దిగువకు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. గత రాత్రి కురిసిన భారీ వర్షానికి డ్యాం పూర్తిగా నిండిందని అన్నారు. పరిసర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.

October 13, 2025 / 08:12 AM IST

ఫీజు చెల్లింపునకు ఈనెల 23 వరకు గడువు

WGL: KU పరిధిలోని ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో డిగ్రీ BA, B.Com, BBA, BBM, B.Sc, B ఓకేషనల్, BCA, BHM & సీటీ (రెగ్యులర్ & బ్యాక్ లాగ్) కోర్సుల 1, 3, 5వ సెమిస్టర్ పరీక్షల పరీక్ష ఫీజు అపరాధ రుసుం లేకుండా ఈనెల 23 వరకు చెల్లించేందకు గడువు ఉందని పరీక్షల నియంత్రణాధికారి కె.రాజేందర్ తెలిపారు. రూ.50 అపరాధ రుసుముతో ఈనెల 25 వరకు ఉందన్నారు.

October 13, 2025 / 08:11 AM IST

గుండెపోటుతో హెల్త్ అసిస్టెంట్ మృతి

NGKL: బిజినేపల్లి మండలం లట్టుపల్లి పీహెచ్సీలో హెల్త్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న మహమ్మద్ సలీం (50) గుండెపోటుతో మృతి చెందారు. ఉదయం గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. మహబూబ్‌నగర్‌లోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం సాయంత్రం మరణించారు. సలీం స్వగ్రామం తాడూరులో విషాదఛాయలు అలుముకున్నాయి.

October 13, 2025 / 08:10 AM IST

నేడు జిల్లాస్థాయి వాలీబాల్ ఎంపిక పోటీలు

ASF: జిల్లా కేంద్రంలోని గిరిజన ఆదర్శ క్రీడా పాఠశాలలో నేడు (సోమవారం) జిల్లాస్థాయి వాలీబాల్ ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు అదనపు కలెక్టర్,DEO దీపక్ తివారి ప్రకటనలో తెలిపారు. అండర్- 17(బాలుర) విభాగంలో నిర్వహించే పోటీలకు హాజరయ్యే వారు బోనఫైడ్, ఆధార్ కార్డు వెంట తెచ్చుకోవాలని సూచించారు. ఉదయం 10 గంటలకు పీడీ రాకేశ్ కు రిపోర్టు చేయాలన్నారు.

October 13, 2025 / 08:10 AM IST

ఎమ్మెల్యే భూపతిరెడ్డిని పరామర్శించిన మంత్రి వివేక్

NZB: రూరల్ MLA డా.భూపతి రెడ్డిని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకట స్వామి, వర్ధన్నపేట్ MLA నాగరాజు ఆదివారం సాయంత్రం పరామర్శించారు. ఇటీవల MLA భూపతి రెడ్డి మాతృమూర్తి రేకులపల్లి లక్ష్మీ నర్సమ్మ మృతి చెందిన విషయం తెలిసిందే. నగర శివారులోని బైపాస్ ప్రాంతంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మంత్రి వివేక్, ఎమ్మెల్యే నాగరాజు ఆయన్ను పరామర్శించారు.

October 13, 2025 / 08:03 AM IST

ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజావాణి: తహసీల్దార్

MDK: ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని రామాయంపేట తహసీల్దార్ రజినీకుమారి అన్నారు. సోమవారం తహసీల్దార్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ఆమె పేర్కొన్నారు. ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ప్రజా సమస్యలపై ఫిర్యాదులు స్వీకరిస్తామని, ఏవైనా సమస్యలు ఉంటే ప్రజలు నేరుగా ఫిర్యాదులు అందజేయాలన్నారు.

October 13, 2025 / 08:03 AM IST

హుజురాబాద్‌లో ఆర్ఎస్ఎస్ దశాబ్ది ఉత్సవాలు

KNR: హుజురాబాద్ పట్టణంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వంద సంవత్సరాల సందర్భంగా విద్యానగర్ నుంచి పలు వీధుల గుండా స్వయం సేవకులు పథ సంచలన్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వక్తగా రామ్ ప్రసాద్ జిల్లా బౌద్ధిక్ ప్రముఖ్ హాజరయ్యారు. వారు మాట్లాడుతూ.. దేశ భక్తి రక్షణకు స్వయం సేవకులు ముందు ఉంటారని మాతృ భూమి రక్షణ కోసం ధ్యేయంగా ఆర్ఎస్ఎస్ పని చేస్తుందన్నారు.

October 13, 2025 / 08:02 AM IST

సంతలో సెల్ ఫోన్‌ల దొంగతనం

KMR: బిక్కనూర్‌లో ఆదివారం జరిగిన వారాంతపు సంతలో దొంగలు రెచ్చిపోయారు. కూరగాయలు కొనుగోలు చేయడానికి వచ్చిన వినియోగదారుల నుంచి గుర్తుతెలియని దుండగులు నాలుగు సెల్ ఫోన్లను దొంగిలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు మార్కెట్ ప్రాంతంలో గాలించినప్పటికీ దొంగల ఆచూకీ లభించలేదు. దొంగిలించిన ఫోన్లను నిందితులు స్విచ్ ఆఫ్ చేయడంతో వారిని పట్టుకోవడం కష్టమైంది.

October 13, 2025 / 08:02 AM IST

నేడు జిల్లా కాంగ్రెస్ పార్టీ కీలక సమావేశం

NRPT: జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం సీనియర్ నాయకుల సమావేశం నిర్వహించనున్నట్లు డీసీసీ అధ్యక్షుడు ప్రశాంత్ రెడ్డి తెలిపారు. ఉదయం 10 గంటలకు నారాయణపేట డీసీసీ కార్యాలయంలో, మధ్యాహ్నం 2 గంటలకు మరికల్ మండల కేంద్రంలో సమావేశాలు జరుగుతాయన్నారు. ఈ సమావేశాలకు ముఖ్య అతిథులుగా మంత్రి వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యే హాజరవుతారన్నారు.

October 13, 2025 / 08:02 AM IST

జూబ్లీహిల్స్ BJP అభ్యర్థిగా దీపక్ రెడ్డి..?

HYD: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో BJP అభ్యర్థిగా దీపక్ రెడ్డి పేరును పార్టీ జాతీయ నాయకత్వం ఎంపిక చేసినట్టు సమాచారం. ఢిల్లీలో జరిగిన BJP కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోగా, పార్టీ పార్లమెంటరీ బోర్డు ఆమోద ముద్ర వేసినట్టు తెలిసింది. కాగా, జూబ్లీహిల్స్‌లో పోటీ కోసం దీపక్ రెడ్డి, కీర్తిరెడ్డి, పద్మ పేర్లతో కూడిన జాబితాను తయారుచేశారు.

October 13, 2025 / 07:58 AM IST

ఆశావహులకు రిజర్వేషన్లపై గుబులు

MDK: బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 9పై హైకోర్టు స్టే విధించింది. దీంతో స్థానిక ఎన్నికలకు బ్రేక్ పడింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు మారబోతున్నాయని ఆశావహులకు గుబులు పట్టింది. పాత పద్ధతి ప్రకారం రిజర్వేషన్లు అమలు చేస్తే రిజర్వేషన్లు మొత్తం తారుమారవుతాయని ఆందోళనకు గురవుతున్నారు.

October 13, 2025 / 07:58 AM IST