HYD: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో BJP అభ్యర్థిగా దీపక్ రెడ్డి పేరును పార్టీ జాతీయ నాయకత్వం ఎంపిక చేసినట్టు సమాచారం. ఢిల్లీలో జరిగిన BJP కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోగా, పార్టీ పార్లమెంటరీ బోర్డు ఆమోద ముద్ర వేసినట్టు తెలిసింది. కాగా, జూబ్లీహిల్స్లో పోటీ కోసం దీపక్ రెడ్డి, కీర్తిరెడ్డి, పద్మ పేర్లతో కూడిన జాబితాను తయారుచేశారు.