KMR: బిక్కనూర్లో ఆదివారం జరిగిన వారాంతపు సంతలో దొంగలు రెచ్చిపోయారు. కూరగాయలు కొనుగోలు చేయడానికి వచ్చిన వినియోగదారుల నుంచి గుర్తుతెలియని దుండగులు నాలుగు సెల్ ఫోన్లను దొంగిలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు మార్కెట్ ప్రాంతంలో గాలించినప్పటికీ దొంగల ఆచూకీ లభించలేదు. దొంగిలించిన ఫోన్లను నిందితులు స్విచ్ ఆఫ్ చేయడంతో వారిని పట్టుకోవడం కష్టమైంది.