NZB: ఆర్మూర్ పర్యటనకు వెళ్తున్న రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి మార్గమధ్యంలో మోర్తాడ్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ బాల్కొండ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ రెడ్డి మంత్రికి స్వాగతం పలికారు. నియోజకవర్గంలో పార్టీ బలోపేతం, స్థానిక సంస్థల ఎన్నికల గురించి చర్చించినట్లు తెలిపారు.