NRPT: మక్తల్ పట్టణంలో నిర్మాణంలో ఉన్న 150 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని మంత్రి వాకిటి శ్రీహరి ఆదివారం సందర్శించారు. నిర్మాణ పనులను పరిశీలించి, కాంట్రాక్టర్లకు పలు సూచనలు చేశారు. సుమారు రూ.42 కోట్ల వ్యయంతో ఆధునిక సదుపాయాలతో ఆసుపత్రి నిర్మాణం జరుగుతోందని తెలిపారు. మక్తల్ నియోజకవర్గ ప్రజలకు త్వరలోనే ఈ ఆసుపత్రి అందుబాటులోకి రానుందని ఆయన పేర్కొన్నారు.