GNTR: అనుమతులు లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా బాణాసంచా నిల్వ ఉంచినా, విక్రయించినా చట్టపరమైన చర్యలు తప్పవని ఎస్పీ వకుల్ జిందాల్ (ఐపీఎస్) ఇవాళ హెచ్చరించారు. బాణాసంచా దుకాణం వద్ద నీరు, ఇసుక, ఫైర్ ఎక్స్టింగ్విషర్ వంటి అగ్నిమాపక పరికరాలు తప్పనిసరిగా ఉంచాలన్నారు. విక్రయాలలో మైనర్లను వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.