SRD: CITU జిల్లా మహాసభలను19న సదాశివపేట పట్టణంలో జరగనున్నాయని సీఐటీయు నాయకులు కే.రాజయ్య అన్నారు. ఆదివారం పటాన్చెరు శ్రామిక భవన్లో కిర్బీ పరిశ్రమ కార్మికులతో కీలక సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. సీఐటీయూ ఉన్నపారిశ్రామిక ప్రాంతాలలోనే కార్మికుల సమస్యలు పరిష్కారం అవుతున్నాయని అన్నారు. వివిధ పరిశ్రమల కార్మికులు సీఐటీయును ఆశ్రయిస్తున్నారని అన్నారు.