ASR: అనంతగిరి మండలం కరయిగూడ గ్రామానికి చెందిన శాంతి (20) కందిరీగల దాడికి గురై మృతి చెందింది. ఆదివారం సాయంత్రం పశువులను కాసేందుకు వెళ్లిన సమయంలో కందిరీగలు గుంపుగా దాడి చేయడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. చికిత్స కోసం అరకు ప్రాంతీయ ఆసుపత్రికి తరలించగా, నేడు చికిత్స పొందుతూ మృతి చెందింది.